తెరపైకి వివేకా సన్నిహితుడి పేరు?

Published: Monday March 18, 2019
వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య మిస్టరీగానే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఐదు బృందాలను నియమించి విచారణ వేగవంతం చేసింది. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పర్యవేక్షణలో మరో ఏడు బృందాలు à°ˆ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 20 మంది సాక్షులను విచారించారు. ఏ అంశాన్నీ వదలకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పులివెందుల పోలీసుస్టేషన్‌కు వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని పిలిపించి విచారణ జరిపి వారి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. హత్య అనంతరం ఎన్ని గంటలకు వెళ్లారు? రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గుండెపోటుతో చనిపోయినట్లు ఎందుకు చెప్పారు? అన్న అంశాలపైనే à°ˆ విచారణ జరిగింది.
 
భూ సెటిల్‌మెంట్లే ఘాతుకానికి కారణమా అన్న కోణంలోనూ విచారణ సాగుతుండగా.. పరమేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల పాటు జరిపిన సిట్‌ దర్యాప్తులో కీలకాంశాలను గుర్తించినట్లు ఆదివారం రాత్రి ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మీడియాకు తెలిపారు. ‘‘మృతుడు వైఎస్‌ వివేకా గురువారం రాత్రి 11.30 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో ఇంటికి వచ్చారు. వివేకానందరెడ్డి, గంగిరెడ్డి, మల్లయ్య రవికుమార్‌, డ్రైవర్‌ ప్రసాద్‌లతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చారు. ఇంటికి వెళ్లగానే డ్రైవర్‌ను పంపి వివేకా నిద్రపోయారు. పీఏ కృష్ణారెడ్డి ఉదయాన్నే 5.30 గంటలకు ఇంటికి వచ్చారు. à°…à°°à°—à°‚à°Ÿ దాటినా వివేకా నిద్ర లేవకపోవడంతో కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఆయన భార్య సౌభాగ్యమ్మకు ఫోన్‌ చేశారు. రాత్రి ఆలస్యంగా రావడంతో నిద్రపోతున్నారని, లేపొద్దని తెలిపింది. కొద్ది సేపటి తర్వాత వాచ్‌మెన్‌తో కలిసి కృష్ణారెడ్డి బెడ్‌రూం తలుపు తీసి లోపలికి వెళ్లగా.. రక్తం కనిపించింది. బాత్‌రూంకు వెళ్లి చూస్తే మృతదేహం కనిపించింది. మాజీ ఎంపీ అవినా్‌షరెడ్డికి, రాఘవరెడ్డికి పులివెందుల సీఐకి వివేకా గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.
 
వెంటనే సీఐ అక్కడికి చేరుకోగా కృష్ణారెడ్డి, వాచ్‌మెన్‌ రంగన్న, ఇనయతుల్లా, దొడ్లవాగు శంకర్‌రెడ్డి, ఎర్రా గంగిరెడ్డి, వైఎ్‌à°¸.మనోహర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్‌ నాయక్‌, వైఎ్‌à°¸.అవినా్‌షరెడ్డి ఇంకా కొందరు నేరస్థలం వద్ద ఉన్నారు. రక్తపు మరకలున్న దుప్పటిని మార్చేయడంతో పాటు మృతుని గాయానికి కట్టు కట్టి ఉంది. వివేకా వాంతి చేసుకొని కమోడ్‌పై పడగా గాయాలైనట్లు సీఐకి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బలవంతంగా దుండగులు ఇంట్లోకి వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. పోస్టుమార్టం అనంతరం వైద్యులు ఇది హత్యగా నిర్ధారించారు. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు డీఐజీ నేర స్థలానికి వెళ్లి వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, భార్య సౌభాగ్యమ్మలను విచారించారు. అనంతరం పీఏ కృష్ణారెడ్డి వచ్చి నేరస్థలంలో దొరికిందంటూ వివేకా రాసిన లేఖను పోలీసులకు అప్పగించారు.