కంచుకోట బద్దలు కొట్టేందుకు టీడీపీ రె‘ఢీ’

Published: Tuesday March 19, 2019
 à°µà±ˆà°Žà°¸à±‌ కుటుంబానికి 30 ఏళ్లుగా కంచుకోట à°•à°¡à°ª లోక్‌సభ స్థానం.. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరు.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో టీడీపీ ఒక్కసారి మాత్రమే ఇక్కడ గెలిచింది. 1989 నుంచి 9 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే వైఎస్‌ కుటుంబానిదే విజయం. 4 సార్లు (1989, 91, 96, 98) వైఎస్‌ రాజశేఖరరెడ్డి వరుసగా గెలిచారు. రెండు సార్లు (1999, 2004) ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి, మరో రెండు సార్లు (2009, 2011 ఉప ఎన్నిక) ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, 2014లో ఆయన తమ్ముడి కొడుకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి గెలిచారు. à°ˆ దఫా అవినాశ్‌ మళ్లీ వైసీపీ నుంచి బరిలో నిలువగా.. మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ తరపున పోటీచేస్తున్నారు. ఇదివరకటిలా à°ˆ సారి ఎన్నిక ఏకపక్షం కాబోదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీడీపీ జోరుమీద ఉండడమే గాక ఉక్కు కర్మాగారం కేంద్రం ఏర్పాటు చేయకున్నా జగన్‌ నోరుమెదకపోవడం.. రాష్ట్రప్రభుత్వమే సొంతంగా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం.. à°ˆ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించడం, చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలతో తొలిసారి వైఎస్‌ కంచుకోటను బద్దలు కొట్టగలమన్న ఆశాభావంతో ఉంది. అయినా వైఎస్‌ కుటుంబంపై ఉన్న ఆదరాభిమానాలే తనను మళ్లీ గెలిపిస్తాయని అవినాశ్‌ భావిస్తున్నారు.
 
à°•à°¡à°ª లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక మొదలు.. ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాలను పూర్తిగా ఆది పర్యవేక్షిస్తున్నారు. మొదట గెలిచే అభ్యర్థులను గుర్తించి వారికే టికెట్లు కేటాయింపజేశారు. వివిధ సమీకరణలు, సామాజిక వర్గాలతో చర్చలు, ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నారు. అవినాశ్‌ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తన వైపు తిప్పుకొంటున్నారు.
à°•à°¡à°ª లోక్‌సభ పరిధిలో à°•à°¡à°ª, బద్వేలు(ఎస్సీ), మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. à°ˆ నియోజకవర్గాల్లో మొత్తం 14,56,623 మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక వర్గాల పరంగా ఓట్లను చూస్తే అత్యధికంగా బీసీలే. తర్వాత రెడ్డి, ముస్లిం, ఎస్సీ తదితర వర్గాల ఓట్లు ఉన్నాయి.