ఉగ్రవాదుల దాడులపై ఇంటలిజెన్స్ హెచ్చరిక

Published: Wednesday March 27, 2019
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు వివిధ రాజకీయపార్టీల కార్యకర్తలపై దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ విభాగం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. à°Žà°¨à±à°¨à°¿à°•à°² సందర్భంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా, అల్ బద్రా ఉగ్రవాద సంస్థలు దాడులకు దిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనకుండా భయపెట్టేందుకు ఉగ్రవాదులు దాడులు చేయవచ్చిని, భద్రతాబలగాలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థ కోరింది.
 
సోపోరి, బందిపోరే, గండర్ బల్ ప్రాంతాల్లో కొందరు నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేయవచ్చిన ఇంటలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడులను నిరోధించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో 5వదశలో, కశ్మీర్ లోయ, బారాముల్లాలో వేర్వేరు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రవాదుల భయంతో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు వలస వచ్చి ఎమ్మెల్యే హాస్టల్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్నారు. మొత్తంమీద కశ్మీర్ లో ఎన్నికల సందర్భంగా ఎలాంటి దాడులు జరగకుండా భద్రత బలగాలను మోహరించారు.