ఏం.. వారాణసీ నుంచి వద్దా..?

Published: Friday March 29, 2019

నరేంద్ర మోదీ వర్సెస్‌ ప్రియాంకా గాంధీ...... లోక్‌సభ ఎన్నికల పోరులో ఇదే గనక నిజమైతే అది నిజంగా బ్లాక్‌బస్టర్‌ పోరాటమే! గురువారం సాయంత్రం à°ˆ ప్రచారం ఒక్కపెట్టున రాజకీయ, సామాజిక వర్గాల్లో ఊపందుకుంది. దీనికి కారణం.. ప్రియాంక చేసిన వ్యాఖ్య. తన తల్లి సోనియాగాంధీ బరిలో ఉన్న రాయ్‌బరేలీలో ఆమె తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు ఆమెను ‘మీరే ఇక్కడ పోటీచేయాల్సింది..’ అని కోరారు. దానికి ఆమె వెంటనే ‘ ఏం.. వారాణసీ నుంచి వద్దా..?’ అని ఎదురు ప్రశ్నించారు. దానికి వారు ఎక్కడైనా సరే... అని అనడంతో ఆమె మళ్లీ కల్పించుకుని.. ‘చెప్పండి... వారాణసీ నుంచి పోటీచేయనా? వద్దా’ అని మళ్లీ మళ్లీ నవ్వుతూ అడిగారు. వారాణసీ నరేంద్ర మోదీ నియోజకవర్గం కావడం, మళ్లీ ఆయనే రంగంలోకి దిగుతుండడంతో ఆమెపై ప్రియాంక పోటీ అన్నది à°“ హాట్‌ టాపిక్‌లా మారింది. మోదీపై బ్రహ్మాస్త్రమేనంటూ కాంగ్రెస్‌ వర్గాలు ఉత్సాహం ప్రదర్శించాయి. బీజేపీ స్థానిక నేతలు- ఆమెను వారాణసీ నుంచి పోటీకి కూడా ఆహ్వానించారు. ‘à°°à°‚à°¡à°¿.. తొలిపోటీలోనే à°“à°¡à°¿à°¨ నేతగా రికార్డు సృష్టించవచ్చు’ అని ఎగతాళి చేశారు. గురువారం నాటి ఆమె వ్యాఖ్య పార్టీ శ్రేణుల్లో తెగ జోష్‌ నింపిందని మాత్రం చెప్పవచ్చు. ఆమె పోటీకి దిగుతారా లేదా అన్నది పక్కన పెడితే ఇది ప్రియాంక తరహా మైండ్‌గేమ్‌ అని పార్టీ వర్గాలు అంటున్నాయి.