బండారు’పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధ్వజం

Published: Monday April 08, 2019
పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముదపాకలో రైతుల భూములు లాక్కొన్నారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆరోపించారు. పెందుర్తిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముదపాకలో తాను ఇదివరకు పర్యటించినప్పుడు అక్కడి రైతులు ఎమ్మెల్యే బండారు భయబ్రాంతులకు గురిచేసి, సంతకాలు పెట్టుకుని తమ భూములు లాక్కున్నారని చెప్పారన్నారు. బండారు తనయుడు అప్పలనాయుడుకు భయపడుతూ బతకాలా అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేకు భయపడి.. ఆయన కొడుక్కీ భయపడుతూ ప్రజలు బతకాల్సిన పరిస్థితి మారాలన్నారు. పులగాలిపాలెంలో రోడ్డు వేయని బండారుకు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు. పరవాడలో పరిశ్రమలు వెదజల్లే విషవాయువల వల్ల పలు గ్రామాల ప్రజలు వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతుంటే బండారు పరిశ్రమల యజమానులతో కుమ్మకై సొమ్ములు దోచుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేగా సింహాచల దేవస్థాన భూ సమస్య పరిష్కారంలో ఎందుకు చొరవ చూపలేదన్నారు. కనీసం పెందుర్తిలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
 
ఉత్తరాంధ్రలో భూ దోపిడీ ఆపకపోతే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోనని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 2006లో ‘అన్నవరం’ సినిమా షూటింగ్‌ సమయంలో à°•à°¡à°ª మేయర్‌à°—à°¾ ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డి తనకు సినిమా చేసి పెట్టాలని రూమ్‌లోకి వచ్చి బెదిరించినట్టు అడిగారని... నా ప్రమేయం లేకుండా నా గదిలోకి ఎందుకొచ్చారంటూ ఆనాడే నిలదీశానని వివరించారు. ఎవరి జోలికి వెళ్లే మనస్తత్వం తనది కాదని, నా జోలికి ఎవరొచ్చినా తాటతీస్తానని హెచ్చరించారు. రాజకీయాలకు భయపడి రాలేదని, ఇందులో ఎత్తుపల్లాలు చూశానన్నారు. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాక రాజకీయ పార్టీ పెట్టగలనా అని ఆలోచించానని, మార్పు కోసం ‘జనసేన’ పెట్టడం జరిగిందన్నారు.
 
పెందుర్తిలో పవన్‌కల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వీధి లైట్లు ఆపగలిగారని.. ప్రజల హృదయాల్లో మార్పును ఆపగలిగారా అంటూ.. ఆవేశంగా మాట్లాడారు. à°ˆ క్రమంలో మూర్కులు గడియారంలో ముల్లును ఆపుదామనుంటున్నారని పలు కవితలు చదువుతూ... వేదిక చుట్టూ కలయతిరిగుతూ ప్రజలకు అభివాదాలు చేశారు. తొలుత ‘గబ్బర్‌సింగ్‌’ టీమ్‌ నటులు ప్రజలను ఉత్సాహపరిచారు. కార్యకర్తలు, అభిమానులు సీఎం పవన్‌ అంటూ నినాదాలు చేశారు.