మే 23 నాటికి రుణమాఫీ సంపూర్ణం

Published: Tuesday April 09, 2019
 à°…న్నమాట నిలుపుకొన్నారు. పాదయాత్ర బాటలో ఇచ్చిన హామీ నెరవేర్చారు. బ్యాంకు రుణాలను మరికొంతగా మాఫీ చేసి, అన్నదాత ఆనందాన్ని మరింత పెంచారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ లబ్ధిని పొందిన రైతులకు, తాజా మాఫీతో డబుల్‌ ధమాకా అందించినట్టయింది. మాఫీ డబ్బులు బ్యాంకులో పడ్డాయని తెలిసి, రాష్ట్రమంతటా రైతులు సంబరాలు చేసుకొన్నారు. సోమవారం నాలుగో విడత రుణమాఫీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 10ువడ్డీతో కలిపి రూ.3,900కోట్లు అందించింది. à°ˆ సొమ్మును ఆయా బ్యాంకుల అధికారులు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30లక్షల మందికి à°ˆ విడతలో నేరుగా లబ్ధి చేకూరింది.
 
కాగా, నాలుగో విడత సొమ్ము రైతుల ఖాతాలకు జమ చేయడం పూర్తికాగానే అయిదో విడత సొమ్మును కూడా à°ˆ ఖరీఫ్‌ సీజన్‌లోగా విడుదల చేస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. ఏమైనా మే 23లోపే నాలుగు, అయిదు విడతల సొమ్ము రైతుల ఖాతాలకు చేరుతుందని స్పష్టం చేశారు. ‘‘రైతులంతా హడావుడిగా బ్యాంకుల వద్ద క్యూలు కట్టనవరం లేదు. ఉపశమన పత్రాన్ని ఉదయం నమోదు చేస్తే సాయంత్రానికి క్లియర్‌ అవుతుంది. à°† తరువాత 48గంటల్లో సొమ్ము ఖాతాలకు ఆన్‌లైన్‌లోనే జమ అవుతుంది. మాఫీకి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాకు జమ అవుతుంది. à°ˆ విషయంలో ఎవరూ ఆదుర్దా పడాల్సిన పనిలేదు. రైతు ముందే రుణాన్ని చెల్లించి ఉంటే, à°°à±€ పేమెంట్‌ చేస్తారు’’ అని వివరించారు.
 
2014 ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో రైతు సమస్యలను చంద్రబాబు దగ్గరగా చూశారు. ప్రతిపక్షనేత హోదాలో.. రుణమాఫీ కోసం హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే, ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్షన్నర అప్పు రద్దు చేస్తానని భరోసా ఇచ్చారు. అన్న మాట నిలుపుకొని, ముఖ్యమంత్రి అయిన వెంటనే, తొలుత రూ.50వేలు లోపు రుణాలున్న 23.76లక్షల మంది రైతులకు ఏక మొత్తంగా ఊరట కలిగించారు. వారి అప్పులన్నీ రద్దు చేశారు. మిగిలిన 32లక్షల మంది రైతులకు ఐదు విడతలుగా మాఫీ వర్తింపజేయాలని అప్పుడే ప్రకటించారు. వారికి రుణ ఉపశమన పత్రాలను జారీచేశారు. ఆ ప్రకారం గత ఏడాది ఆగస్టు నాటికే మూడు విడతల మాఫీ సొమ్ము రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ క్రమంలో సుమారు రెండు లక్షలమందిని రుణవిముక్తులను చేశారు. మిగిలిన 30లక్షల మందికి లబ్ధి చేకూర్చే క్రమంలో ఇప్పుడు 4వ విడత ఇచ్చేస్తున్నారు. ఆ వెంటనే 5వ విడత కూడా విడుదల చేయనున్నారు. అదీ పూర్తయితే, మొత్తం రూ.24,500 కోట్లు టీడీపీ ప్రభుత్వం మాఫీ చేసి, తన మాట నిలబెట్టుకొన్నట్టు అవుతుంది.