ఓటు నీ ఆయుధం వ్యవస్థల మార్పునకూ ఇదే నాంది

Published: Wednesday April 10, 2019
ఒక ఒప్పు... వేల జీవితాలను నిలబెడు తుంది. ఒక తప్పు.. వంద ఒప్పులను కాల రాస్తుంది. తప్పు, ఒప్పులకు తేడా ఇదే!. ఓటు వేయడానికీ, వేయకపోవడానికీ బేధం ఇదే. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎందుకో తెలుసా... అవినీతిరహిత పాలకుల ఎన్నికకు ప్రజలే కీలకం కనుక. ప్రగతికి పాటుపడే సమర్థులను చట్టసభలకు పంపించాలి. ఉజ్వల భవితకు బాటలువేసే నేతలను ఎన్నుకోవాలి. ఈ ఓటు హక్కు లేకపోతే సచ్చీలురైన ఏలికలను ఎన్ను కోలేరు. యువత ఓటు విలువ తెలుసు కోకుంటే గెలిచేది రూ.కోట్లు పోసి ఓట్లు కొనే అవినీతి పరులే. వారు చట్ట సభలకు వెళ్తే సుపరిపాలన అందదు. భారతావనిని తీర్చి దిద్దే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఇందు కు ఓటు అనే వజ్రాయుధాన్ని సక్రమంగా వినియో గించాలి. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుని చేతిలో త్రిశూలం.. రాముని చేతిలో బాణం. ఇలా ప్రతి పురాణ పురుషుడికీ ఆయుధాలు ఉన్నట్లే ప్రజల చేతిలో ఉన్న అస్త్రం ఓటు. దీనిని అవినీతిపై గురిపెట్టాలి. సుపరిపాలనకు శక్తిగా మార్చాలి. రండి అందరూ కదలిరండి. ఓటు ద్వారా మంచి నేతలను ఎన్నుకునే సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవద్దు.
 
ప్రజలు మెచ్చిన నేతలను ఎన్నుకునే సమయం రానే వచ్చేసింది. నేతల తల రాతలు మార్చే అస్త్రం మన చేతిలో ఉంది. రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించింది. దీనిని అందరూ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఓటు వేస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పీఎం అవుతారు. అంతటి గొప్ప అవకాశం కల్పించింది మన రాజ్యాం గం. ఓటు అనే రెండు అక్షరాలు ప్రజల జీవన స్థితిగతులను మారుస్తాయి. వ్యక్తుల అస్తిత్వానికి, వ్యవస్థల్లో మార్పునకు నాంది పలుకుతాయి.
 
చాలామంది తమ ఓటు లెక్కలోకి రాదు అనుకుంటారు. మరికొందరు ‘నేను ఒక్కడినే ఓటు వేయకుంటే ఏమవుతుందిలే’ అంటుం టారు. లేకపోతే ఎన్నికల రోజు సెలవు కాబట్టి కుటుంబంతో, స్నేహితులతో à°—à°¡à°ª డానికి ప్రాధాన్యమిస్తారు. ఇంకొంతమంది ఎన్నికల్లో సరైన అభ్యర్థులు లేకపోవడం వల్ల నిరాశగా ఓటు వేయలేదని చెబుతుం టారు. à°ˆ కారణాలన్నీ కూడా ఓటరు తమ హక్కును కోల్పోతున్నాడని తెలియచేస్తాయి. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కును సద్వి నియోగం చేసుకుంటేనే వ్యవస్థలో మార్పు లు సంభవిస్తాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే à°’à°• వ్యవస్థ. దీనికి ప్రతి ఓటూ ముఖ్యమే.
 
ఒక నియోజకవర్గంలో సరాసరిన 54 శాతం మంది మాత్రమే ఓటు వేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిలో గెలిచే పార్టీ 16 నుంచి 20శాతం మాత్రమే ఓట్లను పొందుతోంది. ఆ పార్టీ గెలిచే ఓట్ల శాతం 5శాతం కంటే తక్కువే ఉంటుంది. దీనివల్ల గెలిచిన అభ్యర్థికి ఓటర్లపై చులకన భావం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి. అందరూ ఓటు వేస్తే ఒక కొత్త అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించు కోవచ్చు. ఇందులో మీ ఓటు ఎంత విలు వైనదో గుర్తించాలి. ఈ సారి ఓటర్లలో 18 నుంచి 22 ఏళ్ల వయసు కలిగిన యువత అధికంగా ఉన్నారు. వీరంతా నిజాయితీగా ఓటు వేస్తే చక్కని ఆరోగ్యకరమైన అభ్యు దయ సమాజం ఏర్పడుతుంది.