జగన్ నేమ్ ప్లేట్ హల్ చల్

Published: Tuesday April 16, 2019
ముఖ్యమంత్రి పదవిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ à°Žà°‚à°¤ ఆశపెట్టుకున్నారో ఆయన మాటల్లో తరచూ బయటపడుతూనే ఉంటుంది. సీఎం కావడమే తన లక్ష్యమని జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. కానీ ఎన్నికల పోలింగ్ ముగియగానే à°† పార్టీ నేతలు ఇక జగన్ ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. ‘తొందరపడి à°“ కోయిల ముందే కూసింది’ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
 
à°—à°¤ రెండు, మూడు రోజులుగా ఏపీలో సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోల్ అయిన ఫోటో ఇది. జగన్ సీఎం అయిపోయినట్లేనని.. ఏకంగా నేమ్ ప్లేట్ తయారు చేశారు. ఇంకా ఫలితాలు రాలేదు కాబట్టి సింబాలిక్‌à°—à°¾ సగం మాత్రమే చూపిస్తూ మిగతా సగం ఫలితాల తర్వాత అన్నట్లుగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఇలా à°† ఫోటో బయటకు వచ్చిందో లేదో.. అలా వైరల్ అయిపోయింది. అయితే దీన్ని సీరియస్‌à°—à°¾ తీసుకున్నవాళ్లకన్నా.. ట్రోల్ చేసినవాళ్లే ఎక్కువ. ఆత్రం ఆగడంలేదన్న కామెంట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.