తుపాను హెచ్చరికలతో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Published: Monday April 29, 2019
 à°«à°£à°¿ తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో యంత్రాంగం అప్రమత్తం అయింది. వ్యవసాయ, ఉద్యాన శాఖలు, మత్స్యశాఖ, హార్బర్‌ అధికారులు ఎటువంటి పరిస్థితులపైనా ఎదు ర్కొనేందుకు సిద్ధమయ్యారు.బంగాళాఖాతం లో వాయుగుండం రేపటికి తుఫానుగా మారే పరిస్థితి ఉండటం, మచిలీపట్నానికి 1440 à°•à°¿.మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉం à°¡à°Ÿà°‚, ఉత్తర, దక్షిణాలకు కదులుతుండటం తో జిల్లాకు à°ˆ నెల 29 నుంచి వచ్చే నెల 1à°µ తేదీ వరకు తుఫాను ప్రభావం జిల్లాపై ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. à°ˆ నేపథ్యంలో అందరినీ అప్రమ త్తం చేశామని తెనాలి ఆర్డీఓ రంగయ్య ఆంధ్రజ్యోతికి చెప్పారు. నిజాంపట్నం హార్బర్‌లో రెండో నం బరు ప్రమాద హెచ్చరిక విడుదల చేశామని పోర్ట్‌ కన్జర్వేటర్‌ వెంకటేశ్వరరావు చెప్పా రు.
 
 
తుఫాను తీరందాటే వరకు సముద్రంలో కి చేపల వేటకు వెళ్లటానికి వీలులేదని తెలి పా రు. అయితే మనకు పెనుప్రమాదం ఉటు ం దా, లేక పాక్షిక ప్రభావం కనిపిస్తుందా అనే ది రేపటికి తేలే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. దీనిని ఆధారంగా ఆదివారం మరింత జాగ్రత్తలకు దిగుతామని వివరించా రు. ఈ ప్రాంతంలో 40నుంచి 60కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు అత్యధికంగా 1నుంచి 4మీటర్ల వరకు ఎత్తు ఎగిసిపడే పరిస్థితి ఉందని చెబుతున్నారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రంగయ్య చెప్పారు.