కొత్తవి ఇస్తామంటూ డాక్యుమెంట్లు తీసుకుని భూస్వాహా

Published: Tuesday April 30, 2019
 
 
 
ఇది విశాఖమన్యంలోని ఎగువ కొండపర్తికి చెందిన నేగల పైడమ్మ ఘంటాపథంగా చెప్పిన మాట! అసలు విషయం ఏమిటంటే... ఆమె పేరిట ఉన్న సుమారు 35 ఎకరాలు 2014 నవంబరు 6à°µ తేదీన సముద్ర రెడ్డి అనే వ్యక్తి పేరిట రిజిస్టర్‌ అయిపోయాయి. పైడమ్మ ఒక్కరే కాదు... ఎగువ కొండపర్తికి చెందిన అనేకమంది రైతులు తమ భూములు ఇంకా తమ పేరిటే ఉన్నాయనే భ్రమల్లో ఉన్నారు.
 
 
(ఆంధ్రజ్యోతి - విశాఖపట్నం/అనంతగిరి/అనంతగిరి రూరల్‌/నర్సీపట్నం/విజయనగరం): à°µà°¾à°°à°‚తా లోకంపోకడలు తెలియని వాళ్లు! మాయా మర్మం ఎరుగని వారు! à°† అమాయకత్వమే భూమాంత్రికులకు ఆసరాగా మారింది! అసలు యజమానులైన గిరిపుత్రులకే తెలియకుండా భూములు చేతులు మారడానికి కారణమైంది. విశాఖ మన్యంలో జరిగిన భూమాయపై ‘à°—à°¿à°°à°¿ గీసి దోచారు’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. మన్యంలోని విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిధిలోకి వచ్చే ఎగువ కొండపర్తి కుగ్రామ పరిధిలోని మొత్తం 88 ఎకరాలకు ‘ఇతరులు’ కొట్టేశారు. వాటిని విడతల వారీగా వ్యవసాయేతర అవసరాలకోసం వినియోగించుకునేందుకు అనుమతి కూడా తెచ్చుకున్నారు.
 
à°ˆ పరిణామాలేవీ స్థానికులకు తెలియదు. ‘మీ భూములు మీ పేరిటే ఉన్నాయా? అవి చేతులు మారాయని మీకు తెలుసా?’ అని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు సోమవారం ఎగువ కొండపర్తికి చెందిన వారిని ప్రశ్నించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలో పొలం దున్నుతున్న గుద్దెల తమ్మయ్యను పలకరించినప్పుడు... తనకు రెండు మడులే ఉన్నాయని, కొంత రోడ్డు నిర్మాణంలో పోయిందని చెప్పారు. పట్టాలేకపోవడంతో ఎవరినీ ప్రశ్నించలేకపోతున్నానని తెలిపారు. నిజానికి... తమ్మయ్య పేరిట 1.55 ఎకరాలు, 0.64 ఎకరాలు, 0.15 ఎకరాల చొప్పున మూడుచోట్ల జిరాయితీ భూమి ఉన్నట్టు రికార్డులలో స్పష్టంగా ఉంది. వారసత్వంగా వచ్చిన à°† భూముల పట్టాలు గతంలో ఎప్పుడో అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దాంతో వారి భూమి ఎక్కడుందో వారికే తెలియడం లేదు. ఇలాంటి వివరాలన్నీ స్థానిక రెవెన్యూ సిబ్బంది భూమాయగాళ్లకు బాగానే అందించినట్లు తెలిసింది.
 
 
అడ్డతీగలకు చెందిన మాజీ సర్పంచ్‌ ఒకరు గిరిజనులకు మాయమాటలు చెప్పి... ‘రెడ్డి’ కొత్తపట్టాలు ఇస్తాడని నమ్మించి వారి దగ్గరున్న పట్టాలన్నీ చేతులు మారేలా చేసినట్లు తెలిసింది. ‘‘కొత్తపట్టాలు చేయించి ఇస్తామని చెప్పి రెడ్డిగారు పాతపట్టాలు తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు ఇవ్వనేలేదు’’ అని ఎగువ కొండపర్తికి చెందిన నేగల పైడమ్మ, నేగల ఎర్రయ్య, నేగల సంజీవ్‌, నేగల పోలయ్య, నేగల సన్యాసి, నేగల సముద్రం తెలిపారు. ఎస్‌.కోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సంబంధిత రికార్డులను పరిశీలించగా వీరి భూములన్నీ మొత్తం 2014, 2015లలోనే సముద్ర రెడ్డి అనే వ్యక్తి పేరిట రిజిస్టర్‌ అయినట్లు తేలింది. ‘‘మేం భూములు అమ్మలేదు. కొత్తపట్టాలు ఇస్తామన్నందుకే రెడ్డికి మా పాత పట్టాలు ఇచ్చాం’’ అని గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు తెలిపారు. 2014 అక్టోబరు నుంచి 2015 ఏప్రిల్‌ మధ్య దాదాపు 44 మంది రైతుల భూములను మాయగాళ్లు రిజిష్టర్‌ చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.