తేడా వస్తే వీవీప్యాట్‌లతో సరి

Published: Thursday May 02, 2019
 à°’కప్పుడు బ్యాలెట్‌ పత్రాలు! తేడా వస్తే... మళ్లీ మళ్లీ లెక్కించి ఫలితం తేల్చేవాళ్లు! తర్వాత ఈవీఎంలు వచ్చాయి! ‘తేడా వచ్చిందో... లేదో’ తెలిసే ఆస్కారమే లేదు. పార్టీల అనుమానాల నేపథ్యంలో వీవీప్యాట్‌ స్లిప్పులు ప్రవేశపెట్టారు. మరి... ఈవీఎంలో నమోదైన ఓట్లకు, వీవీప్యాట్‌ స్లిప్పులకు మధ్య తేడా వస్తే... ఏం చేయాలి? దీనికి ఎన్నికల కమిషన్‌ à°’à°• ‘సింపుల్‌’ పరిష్కారాన్ని కనుగొంది. ఎక్కడైనా తేడా వస్తే... వీవీ ప్యాట్‌ స్లిప్పులనే అంతిమంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కేవలం ఐదు బూత్‌లలోని వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలి.
 
 
అయితే, ఈవీఎంలో నమోదైన ఓట్లకు, వీవీప్యాట్‌ స్లిప్పులకు మధ్య తేడా వస్తే.. అది చాలా తీవ్రమైన అంశం. à°† తేడా అదొక్క ఈవీఎంకు మాత్రమే పరిమితమైందని నమ్మేదెలా? ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో తప్పులు జరగలేదనే గ్యారెంటీ ఏమిటి? తప్పు ఎక్కడ జరిగింది? దానిని ఎలా సరిదిద్దాలి? దానికి బాధ్యులెవరు? ఇంత తీవ్ర అంశాన్ని ఈసీ చాలా తేలిగ్గా తీసుకుంది. వీవీప్యాట్లలో వచ్చిన ఓట్లనే పరిగణలోకి తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి స్థాయిలోనే నిర్ణయం తీసుకోవచ్చని, పోలింగ్‌ ముగిసిన తర్వాత తమకు నివేదిక పంపాలని à°† ఉత్తర్వులో పేర్కొన్నారు. à°ˆ ఉత్తర్వులు రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
 
 
తేడానే రావొద్దు...
ఈవీఎంలలో ఎన్ని ఓట్లు నమోదయితే, వీవీ ప్యాట్‌లో కూడా అన్నే ఉండాలి. పార్టీల వారీగా పడిన ఓట్లు కూడా సరిపోలాలి. తేడా వచ్చిందంటే ఈవీఎంలో లోపం ఉన్నట్లే. లోపం ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోనక్కర్లేదని.. వీవీప్యాట్‌ స్లిప్పులనే పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ చెబుతోంది. దేశవ్యాప్తంగా 14.5 లక్షల పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇందులో సుమారు 29 వేల వీవీప్యాట్‌లనే లెక్కిస్తున్నారు. ఇందులో ఏవో కొన్ని వీవీప్యాట్‌లలో లోపాలున్నాయని నిర్ధారణ అయినా... మిగతా వాటిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది.
 
ఈసీ వాదిస్తున్నట్లుగా ఈవీఎంలు లోపరహితమయితే తేడా రాకూడదు. తేడా వచ్చిందంటే ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురయ్యాయని, లేదా మరేదైనా తీవ్ర లోపం ఉందని అనుమానించాల్సి ఉంటుంది. నియోజకవర్గానికి ఐదు ఈవీఎంల స్లిప్పుల్లోనే తేడా వస్తే... మిగిలిన వాటి పరిస్థితి ఏమిటనే అనుమానాలు తలెత్తడం సహజం. ఈసీ మాత్రం చాలా నింపాదిగా, తేడా వస్తే వీవీ ప్యాట్‌లనే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించి మరో వివాదానికి తెరలేపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.