విశాఖకు 160 కి.మీ. దూరంలో పెను తుఫాను

Published: Friday May 03, 2019
పెనుతుఫాను ‘ఫణి’ ప్రచండ రూపం దాలుస్తోంది. గురువారం సాయంత్రానికి విశాఖపట్నానికి తూర్పు ఈశాన్య దిశగా 160à°•à°¿.మీ., పూరికి దక్షిణ నైరుతి దిశగా 240à°•à°¿.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్యంగా పయనించి ఉత్తర కోస్తాకు మరింత చేరువగా వచ్చి తీరానికి సమాంతరంగా ఒడిసా వైపు వెళ్లనుంది. ముందుగా వేసిన అంచనా ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కాకుండా ఉదయం నుంచే తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి పూర్తిగా పూరి జిల్లా ఉదయగిరి వద్ద తీరం దాటనుంది. à°† సమయంలో గంటకు 170- 180 అప్పుడప్పుడు 200à°•à°¿.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయి. తీరం దాటిన తరువాత క్రమేపీ బలహీనపడి అతితీవ్ర తుఫానుగా, తీవ్ర తుఫానుగా మారి పశ్చిమబెంగాల్‌లో ప్రవేశించనుంది. అనంతరం మరింత బలహీనపడి తుఫానుగా మారి శనివారం బంగ్లాదేశ్‌లో ప్రవేశించనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
 
 
బంగాళాఖాతంలోని పెనుతుఫాను పరిసరాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి 180- 190, అప్పుడప్పుడు 210కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవి శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగి క్రమేపీ తగ్గుతాయి. ఫణి తీరం దిశగా వచ్చిన నేపథ్యంలో ఉత్తర కోస్తాలో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం గంటకు 60- 70, అప్పుడప్పుడు 85కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు, రాత్రి నుంచి మరింత పెరగనున్నాయి. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిసా తీరప్రాంత జిల్లాల్లో గంటకు 90-100, అప్పుడప్పుడు 115కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. పెనుతుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రారంభమైన వర్షాలు గురువారం రాత్రి నుంచి పెరగనున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా, అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా కుంభవృష్టిగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.