పెరిగిన ఖర్చు కేంద్రం ఇవ్వనంది

Published: Sunday May 05, 2019
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనా వ్యయాన్ని తాము భరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, à°† భారాన్ని రాష్ట్రప్రభుత్వమే మోసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. దీనివల్ల రూ.28,467కోట్ల భారం రాష్ట్రంపై పడిందన్నారు. à°ˆ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శనివారమిక్కడ బహిరంగ లేఖ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘2017-18 ఖర్చుల ప్రకారం అంచనా వ్యయాలను కేంద్ర జల వనరుల శాఖ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) రూ.55,549 కోట్లుగా ఖరారు చేసినప్పటికీ.. 2013-14 ఖర్చుల ప్రకారం అయ్యే అంచనా వ్యయానికి మించి నిధులు ఇవ్వబోమని కేంద్రం హైకోర్టుకు చెప్పింది. à°ˆ ఏడాది ఫిబ్రవరి 11à°¨ సమావేశమైన టీఏసీ 2017-18 ఖర్చుల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.55,549 కోట్లకు సవరించింది. అదే సమావేశంలో 2013-14 ఖర్చుల ప్రకారం అంచనా వ్యయం రూ.27,082 కోట్లుగా నిర్ధారించింది. అయితే నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించే సమయంలో.. 2013-14 ఖర్చుల ప్రకారం అయ్యే అంచనా వ్యయాన్ని మాత్రమే భరిస్తామని, మిగతా మొత్తాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం విధించిన షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రం రూ.27,082 కోట్లు మాత్రమే ఇస్తుంది.
 
 
మిగతా రూ.28,467 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇది చంద్రబాబుకు తెలిసినా ఆయన ప్రజలకు చెప్పడం లేదు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేలా అధికారులకు సీఎం ఆదేశాలివ్వాలి’ అని కేవీపీ డిమాండ్‌ చేశారు. కాగా.. పాత అంచనా వ్యయం ప్రకారమే నిధులిస్తామని కేంద్రం షరతు విధించినట్లు.. రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించినట్లు టీఏసీ మినిట్స్‌లో ఎక్కడా లేకపోవడం గమనార్హం.