సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Published: Tuesday May 07, 2019

విశాఖ: à°¸à°¿à°‚హాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారు జామున 2-30 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్తలు అశోకగజపతిరాజు కుటుంబ సభ్యులు మొదటి పూజ చేశారు. అనంతరం సామాన్య భక్తులకు అనుమతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ జేఈవో శ్రీనివాసులు పట్టువస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² నుంచి భక్తులకు స్వామివారి నిజరూపం దర్శనం కల్పించారు. అలాగే హోంమంత్రి చినరాజప్ప.. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, పళ్లంరాజు, అవంతి, బండారు, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు కూడా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లలో నిలుచున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులక ఇవాళ స్వామివారి నిజరూపదర్శనం కల్పిస్తున్నారు.