కౌంటింగ్‌లో తొందరపడొద్దు ప్రతి ఓటూ లెక్కించాల్సిందే

Published: Wednesday May 08, 2019
 à°“ట్ల లెక్కింపు పక్కాగా జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్లక్ష్యం చూపొద్దని, ప్రతి ఓటు లెక్కించాల్సిందేనని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. కౌంటింగ్‌లో తొందరపాటు తగదని హెచ్చరించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు పై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, మాస్టర్‌ శిక్షకులు, ఇతర అధికారులతో సీఈవో రాష్ట్ర స్థాయి శిక్షణా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించారని, దానివల్లే గతంలో ఎన్నడూలేని విధంగా పోలింగ్‌ శాతం పెరిగిందని à°ˆ సందర్భంగా అధికారులను ఆయన అభినందించారు.
‘‘దేశం మొత్తం మీద దివ్యాంగులు అత్యధికంగా మన రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 18-25 సంవత్సరాల వయస్సుగల యువత ఓటింగ్‌ శాతంలో కూడా మూడు శాతం వృద్ధి కనిపించింది. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఒక్క సంఘటన కూడా జరగలేదు. అందరూ బాగా పని చేశారు. అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా సమర్థవంతంగా పూర్తి చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. à°ˆ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతం, కచ్చితత్వంతో వ్యవహరించాలన్నారు. శిక్షణ విషయం ప్రస్తావిస్తూ.. కౌంటింగ్‌పై శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్లు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించి అన్ని విషయాలు తెలియజేస్తారన్నారు. ‘‘ఓటింగ్‌లో, ఓట్ల లెక్కింపులో సాంకేతిక అంశాల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. దానిని ఎంతో మెళుకువతో అధిగమించాలి. ఈవీఎంలతో ఓటింగ్‌ ఫలితాలను తెలియజేసిన అనుభవం ఉంది. అయితే అందుకు అదనంగా వీవీప్యాట్లని లెక్కించడం ఇదే మొదటిసారి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని సూచించారు.
 
 
ఆ వేడి ఈ వేడి కలిసింది..
అన్ని సందర్భాలలోనూ ఒకే రకమైన నిర్ణయం తీసుకుంటే సమస్యలు తలెత్తవని ద్వివేది అన్నారు. ‘‘వాతావరణం వేడిగా ఉంది. దానికి ఎన్నికల వేడి తోడైంది. పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకుని అందరూ జాగ్రత్తగా పని చేయాలి. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనా ఆర్వోలు, ఏఆర్వోలు వెంటనే పరిష్కారం కనుగొనాలి. అటువంటివి వాయిదా వేయడం ద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమావళిని సమగ్రంగా చదవండి. సందేహాలను నివృత్తి చేసుకోండి. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని కోరారు. కౌంటింగ్‌ ఏజెంట్ల గురించి పోలీస్ శాఖ సమాచారం సేకరిస్తుందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ఎంపికను మూడు దశల్లో చేపడతామని, ఏ సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహిస్తారనేది 24 à°—à°‚à°Ÿà°² ముందు మాత్రమే తెలియజేస్తామని, ఏ టేబుల్‌ వద్ద విధులు నిర్వహించాలో మే 23 ఉదయం 5 గంటలకు చెబుతామని చెప్పార
 
కౌంటింగ్‌ ప్రక్రియలో ఎన్నికల నియమావళికి సంబంధించి అంశాల వారీగా న్యాయసంబంధమైన వివరాలను డిప్యూటీ సీఈవో చిరంజీవి à°ˆ సమావేశంలో తెలియజేశారు. ‘‘కౌంటింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. మీడియా పాయింట్‌లో నోటీస్‌ బోర్డులు, టెలివిజన్‌, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం వంటి ఏర్పాట్లు ఉంటాయి. సమాచారశాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికారి ఈసీఐ మార్గదర్శకాల మేరకు చిన్న గ్రూపుల వారీగా విలేకరులను ఆయా కౌంటింగ్‌ కేంద్రాల లోపలకు తీసుకువెళ్లి, తీసుకువస్తారు’’ అని వివరించారు. à°ˆ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి మార్కండేయులు, పలు జిల్లాల కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు ఇతర అధకారులు పాల్గొన్నారు.
 
 
వీవీప్యాట్‌ ఓట్ల లెక్కింపులో à°’à°• నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్‌à°—à°¾ ఐదు కేంద్రాలను ఎంపిక చేస్తారని ద్వివేది తెలిపారు. ‘‘మాక్‌పోల్‌ చేసిన ఓట్లు కూడా వీవీప్యాట్‌లో కలిసిపోయి ఉంటే ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్‌ చేసి వివరించాలి. మాక్‌పోల్‌ వివరాలన్నీ పార్టీల ఏజెంట్స్‌ వద్ద ఉంటాయి. సమస్యలు వచ్చిన పోలింగ్‌బూత్‌à°² కౌంటింగ్‌ను చివరకు లెక్కించాలి. పోస్టల్‌ బ్యాలెట్లను 23à°µ తేదీ ఉదయం 7.59 నిమిషాల వరకు తీసుకోవచ్చు. సమస్యలు ఉండి అవసరమైతే తప్ప రీకౌంటింగ్‌à°•à°¿ అనుమతి ఇవ్వరాదు’’ అని ద్వివేది నిర్దేశించారు. కౌంటింగ్‌ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని కోరారు.