పార్టీ పెట్టిన ఎనిమిదేళ్లకు లక్ష్య సాధన

Published: Friday May 24, 2019
పదేళ్ల నిరీక్షణ ఫలించింది. ఆటుపోట్లు, ఎడబాట్లు, కేసులు, విచారణలు అరెస్టులు... ఇలా ఎన్నో ప్రతిబంధకాలు! వీటన్నింటినీ తట్టుకుంటూ పడిలేచిన కెరటంలా జగన్‌ తాను అనుకున్నది సాధించారు. తండ్రి వైఎస్‌ 2009 సెప్టెంబరులో మరణించినప్పుడే... ఆయన వారసుడిగా ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని జగన్‌ ప్రయత్నించారు. కానీ, ఇన్నేళ్లకు ఆయన లక్ష్యం నెరవేరింది.
 
తండ్రి వైఎస్‌ పాదయాత్రలో, à°† తర్వాత పలు కార్యక్రమాల్లో 2004కు ముందు నుంచే జగన్‌ రాజకీయాల్లో ఉన్నారు. అప్పట్లో బాబాయ్‌ వివేకానందరెడ్డితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో à°•à°¡à°ª నుంచి ఎంపీగా గెలవాలని భావించారు. కానీ, అది కుదరలేదు. చివరికి... 2009లో à°•à°¡à°ª లోక్‌సభ స్థానం నుంచి జగన్‌ పోటీచేసి గెలిచారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటంతో ‘యువనేత’à°—à°¾ à°šà°•à°šà°•à°¾ ఎదిగారు. 2009 సెప్టెంబరు 2à°¨ వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తెలుగు రాష్ట్ర రాజకీయాలే మారిపోయాయి. తండ్రికి వారసుడిగా తానే సీఎం కావాలని జగన్‌ ప్రయత్నించారు. కానీ, అందుకు సోనియా అంగీకరించలేదు. తొలుత రోశయ్యకు, తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక... జగన్‌ తలపెట్టిన ఓదార్పు యాత్రకు కూడా అధిష్ఠానం అనుమతించలేదు. కాలంగడిచేకొద్దీ... తన శిబిరంలో ఉన్న ఒక్కొక్క నాయకుడు జగన్‌ నుంచి దూరమవుతూ వచ్చారు.
 
 
కాంగ్రెస్ లో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని జగన్‌ భావించారు. 2010లోనే కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. à°•à°¡à°ª లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌à°—à°¾ పోటీచేసి భారీ మెజారిటీతో గెలిచారు. జగన్‌కోసం మరో 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చారు. వారు కూడా రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2011లో సొంతంగా యువజన శ్రామిక రైతు (వైఎస్‌ఆర్‌) పార్టీ పెట్టారు.
 
సొంతపార్టీ పెట్టిన జగన్‌... ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అదే సమయంలో... తండ్రి సీఎంగా ఉన్న సమయంలో జగన్‌ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, క్విడ్‌ ప్రోకో à°•à°¿à°‚à°¦ కోట్లు సంపాదించారంటూ à°“ కాంగ్రెస్‌ నేత పిటిషన్‌ దాఖలు చేయగా, హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. జగన్‌పై 27కుపైగా కేసులు నమోదయ్యాయి. 2012 మే 27à°¨ సీబీఐ జగన్‌ను అరెస్ట్‌ చేసింది. 2013 సెప్టెంబరు 24à°¨ అంటే 16 నెలల కారాగారవాసం తర్వాత జగన్‌ విడుదలయ్యారు. అప్పటికే రాష్ట్ర విభజన ప్రక్రియను కాంగ్రెస్‌ చేపట్టింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిపోయింది.