గరిష్ఠంగా 25 మంది మంత్రులు భారీగా విజేతలు, సీనియర్లు

Published: Saturday May 25, 2019
 à°˜à°¨ విజయం సిద్ధించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇక... ‘సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాను! ఆరు నుంచి 12 నెలల్లోనే à°’à°• మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను’ అని ప్రకటించిన జగన్‌... తన మంత్రివర్గంలో ఎవరిని నియమించుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కేబినెట్‌లో ముఖ్యమంత్రి కాకుండా గరిష్ఠంగా 25 మందికి మాత్రమే చోటు ఉంటుంది. అయితే, వైసీపీ నుంచి ఏకంగా 151 మంది గెలిచారు. వారిలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, పార్టీ పెట్టినప్పటి నుంచి తననే అంటిపెట్టుకుని నమ్మకంగా ఉన్న వారూ ఉన్నారు. అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో చోటు ఇస్తానంటూ తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురికి జగన్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు.
 
 
సీనియారిటీ, సామాజిక నేపథ్యం, మహిళలు, జిల్లాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటన్నింటి నేపథ్యంలో సహజంగానే కేబినెట్‌ కూర్పు సవాల్‌లాంటిది. అయితే... జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఎవరిని మంత్రులుగా ఎంపిక చేసుకున్నప్పటికీ కాదనే వారు ఉండరని, అసంతృప్తులు, అలకలకు వైసీపీలో చోటు ఉండదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విపక్షంలో ఉండగా ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌à°—à°¾ సమర్థ పాత్ర పోషించిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఆర్థిక శాఖ అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చురుకైన నాయకుడికి సాగునీటి పారుదల శాఖను అప్పగిస్తారని భావిస్తున్నారు. బహుశా భూమన కరుణాకర రెడ్డికి చాన్స్‌ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.
 
 
శ్రీకాకుళం జిల్లా నుంచిమాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పాలకొండ (ఎస్టీ) ఎమ్మెల్యే కళావతికి చాన్స్‌ ఉందని భావిస్తున్నారు. అయితే.. ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి పేరు కూడా పరిగణనలోకి తీసుకునే వీలుంది. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌నేత బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, పుష్పవాణి, రాజన్నదొర పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖ జిల్లాలో అనకాపల్లి ఎంపీ స్థానానికి వైసీపీ కైవసం చేసుకునేందుకు కృషి చేస్తూ... ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మంత్రి పదవిని ఇస్తానంటూ గుడివాడ అమరనాథ్‌కు జగన్‌ హామీ ఇచ్చారు. వైసీపీని నమ్ముకున్న గొల్ల బాబూరావు, ముత్యాల నాయుడు పేర్లూ వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజాకు అవకాశం ఉందంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తానేటి వనిత పేరు వినిపిస్తోంది. అలాగే... తెల్లం బాలరాజు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను à°“à°¡à°¿à°‚à°šà°¿à°¨ గ్రంథి శ్రీనివాస్‌కు చోటు దక్కుతుందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి బెర్తు ఖరారైనట్లే అని గట్టిగా చెబుతున్నారు.