సంబరపడొద్దంటూ జగన్‌కు హితవు

Published: Sunday May 26, 2019

నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ విమర్శల వర్షం కురిపించారు. సీఎం పదవి వచ్చిందని సంబరపడొద్దంటూ జగన్‌కు హితవుచెప్పారు. ఎగిరెగిరి ఆడితే ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన గఫూర్.. ఎన్నికల వేళ ఇచ్చిన నవరత్నాల హామీన పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. కార్మికులు, రైతుల సమస్యలపై కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమానపనికి సమానవేతనం ఇవ్వాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పెన్షన్‌ను పెంచాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పెన్షన్‌ను పెంచాలని గఫూర్ డిమాండ్ చేశారు. జగన్‌కు ఆరు నెలల సమయం ఇస్తున్నామని, ఇలోగా కార్మికుల సమస్యలపై జగన్ స్పందించకుంటే ఆందోళన చేపడతామని గఫూర్ స్పష్టం చేశారు.