తొందరపడి విమర్శలు వద్దు కొత్త ప్రభుత్వంపై టీడీపీ వైఖరి

Published: Tuesday May 28, 2019
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఫలితాల సాధనకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. సోమవారం చంద్రబాబు అందుబాటులో ఉన్న పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమా మహేశ్వరరావు, లోకేశ్‌ తదితరులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ‘‘అనేక ఆశలతో ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి కొత్తగా వచ్చిన వారికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం తొందరపడి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. ఎలా పనిచేస్తారో, ఎలాంటి ఫలితాలు సాధిస్తారో కొంత కాలం చూద్దాం. à°† తర్వాతే మాట్లాడదాం. ఈలోపు నాయకులు ఎవరూ తొందరపడాల్సిన అవసరం లేదు’’ అని à°ˆ భేటీలో అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న సమాచారంపై à°ˆ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. వారికి à°…à°‚à°¡à°—à°¾ నిలవాల్సిన అవసరం ఉందని, పార్టీ వారి వెంట ఉందన్న భరోసా కల్పించాలని నేతలు నిర్ణయించారు. అవసరమైతే దీనిపై à°’à°• కమిటీని వేసి అన్ని జిల్లాలు, నియోజకవర్గాల వారితో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని నిశ్చయించారు. ‘‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలను పకడ్బందీగా కాపాడాం. ఇటువంటి రాజకీయ దాడులకు అవకాశం ఇవ్వలేదు. ఎక్కడైనా జరిగినా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించాం. ప్రభుత్వంలో ఎవరున్నా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం. అదే సమయంలో మన శ్రేణులు మనో ధైర్యం కోల్పోకుండా à°…à°‚à°¡à°—à°¾ ఉండాలి’’ అనే సందేశం పంపించారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు మరింత అందుబాటులో ఉండి రోజువారీగా వారిని కలవడంపై చర్చ జరిగింది. మంగళగిరిలో నిర్మిస్తున్న పార్టీ నూతన కార్యాలయం పూర్తి కావడానికి సుమారు ఐదారు నెలలు పడుతుందని లోకేశ్‌ చెప్పారు. ఈలోపు గుంటూరులోని రాష్ట్ర కార్యాలయానికి రెగ్యులర్‌à°—à°¾ వెళ్తూ అక్కడ పార్టీ నేతలను కలుస్తానని చంద్రబాబు తెలిపారు.