ఎన్టీఆర్‌ యుగపురుషుడు

Published: Wednesday May 29, 2019
‘మూడున్నర దశాబ్దాలుగా నేను మీకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటున్నా.. ఇకపైనా ఉంటా.. ఎవరూ అధైర్యపడొద్దు’ అని టీడీపీ కార్యకర్తలు, నేతలకు à°† పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇబ్బందులనేవి జీవితంలో వస్తుంటాయని, వాటిని ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ లక్ష్యాలను చేరుకుందామని తెలిపారు.
 
ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకెళ్లి ప్రజల అభిమానం, సహకారం చూరగొందామని పిలుపిచ్చారు. నందమూరి తారకరామారావు 96à°µ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఏర్పాటు చేసిన తొలి కార్యక్రమం కావడంతో నేతలు, కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారికి సీనియర్‌ నేతలు ధైర్యం చెప్పారు. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి వచ్చారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండాను ఎగురవేశారు. అనంతరం.. నాకు ప్రాణ సమానమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికి శుభాభినందనలంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
 
 
‘ఎన్టీఆర్‌ యుగపురుషుడు. తెలుగుజాతి ఉన్నంత వరకు చిరకాలం ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోతారు. ఆయన్ను చూసి కష్టాలు మరిచిపోయి ముందుకుపోవడానికి సిద్ధమవుదాం. ఆయన à°’à°• వ్యక్తి కాదు శక్తి.. వ్యవస్థ. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని à°’à°• సాధారణ కుటుంబంలో పుట్టి గుంటూరులోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక్క రోజే పని చేసి à°† తర్వాత తన జీవితాన్ని నటనకి అంకితం చేశారు. 290 సినిమాల్లో నటించి సమాజంలో మార్పు కోసం రాజకీయ తెరంగేట్రం చేశారు. అలాంటి మహానుభావుడికి కూడా అపజయాలు ఎదురయ్యాయి. అయినా నిబ్బరం కోల్పోలేదు. ఆయన సీఎం కాగానే అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్లు అని నిర్వచనం చెప్పి ఆచరణలో పెట్టి చూపించారు. పక్కా ఇళ్లు, రూ.2కే కిలో బియ్యం, రూ.50కే కరెంటు, పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని (కార్యకర్తలను) చూస్తున్నాను. త్యాగాలు చేశారు.. కష్టపడ్డారు.. అయినాసరే పార్టీ జెండాను మోస్తూనే వచ్చారు. అభివృద్ధి, సంక్షేమంతో మనం ముందుకుపోయాం. రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేశాం. అయినా ఎన్నికల్లో ఫలితం మరోలా వచ్చింది. చాలామంది బాధపడుతున్నారు. కనీసం భోజనం కూడా చేయకుండా దిగులు పడుతున్నారు. ఎవరూ అధైర్యపడొద్దు. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా అయితే రాష్ట్రం కోసమే పని చేశానో అలానే ఉంటా. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి చూద్దాం. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం.. మనకు 40 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు. వారికి à°…à°‚à°¡à°—à°¾ ఉంటూ సేవలందించాల్సిన బాధ్యత ఉంది. లోపాలు సరిదిద్దుకొని ప్రజాసేవతో మళ్లీ టీడీపీకి పూర్వవైభవం తీసుకొద్దాం’ అని పిలుపిచ్చారు.