కొత్త ప్రభుత్వం వైఖరిని బట్టి రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం

Published: Thursday May 30, 2019
 
 à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ మున్సిపాలిటీలు, వార్డుల్లో కులగణన పూర్తి అయింది. పంచాయతీలకు సంబంధించి à°† ప్రక్రియను పూర్తిచేసే పనిలో అధికారులున్నారు. గ్రామాల్లో వార్డుల విభజన ప్రక్రియ ముగిసింది. రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఎన్నికల కసరత్తు ముమ్మరం కానుంది. ఇప్పటికే రిజర్వేషన్లు మొత్తం 60 శాతం అమల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లను 50 శాతానికి కుదించాల్సి ఉంది. à°† మేరకు కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తుందంటున్నారు. 1994 తర్వాత ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన వారిని స్థానిక ఎన్నికల్లో అనర్హులుగా పంచాయతీరాజ్‌ చట్టం పరిగణిస్తోంది. చంద్రబాబు à°† నిబంధనలను ఎత్తేసి వారిని కూడా అర్హులుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం à°ˆ అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
 
 
మొదట పంచాయతీలకు, à°† తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, à°† పిదప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. à°ˆ ఎన్నికల్లో పంచాయతీలు, మండల పరిషత్‌ ఎన్నికలకు బ్యాలెట్‌ పత్రాలు వినియోగించనున్నారు. à°† మేరకు ఇప్పటికే జిల్లాలకు బ్యాలెట్‌ బాక్సులు చేరాయి.
 
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించినప్పటికీ స్థానికసంస్థల ఎన్నికలు మాత్రం బ్యాలెట్‌ పత్రం విధానంలోనే నిర్వహించనున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీయే స్థానికసంస్థల్లో కూడా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం రివాజు. 2013 చివరలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా పంచాయతీల ఎన్నికలు నిర్వహించారు. à°† ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రధాన పోరు సాగగా, ఎక్కువ పంచాయతీలను చంద్రబాబు పార్టీ కైవసం చేసుకుంది. కొద్ది కాలంలోనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం ఎవరిదనేది à°† ఎన్నికల్లోనే తేలిపోయింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది. దీంతో తాము సునాయాసంగా గెలుస్తామని à°† పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. అధికారం కోల్పోయిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా పట్టు కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే వ్యూహంతో టీడీపీ పావులు కదుపుతోంది.
 
 
గత ఏడాదే పంచాయతీల గడువు పూర్తయింది. అప్పటినుంచి ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి పాలన కొనసాగిస్తోంది. అయితే, గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించనందున రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధుల రెండో విడత, 2019-20 సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉంది. వేసవి ఎద్దడిలో ఈ నిధులు అందక.. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుదల కష్టసాధ్యంగా మారింది. అందుకే వీలయినంత త్వరగా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించి, రావాల్సిన కేంద్ర నిధులు రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.