ముఖ్యమంత్రిగా జగన్ జీతం ఎంతో తెలుసా

Published: Thursday May 30, 2019
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహనరెడ్డి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమయింది. నవ్యాంధ్ర పాలకుడి ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబయింది. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు వైఎస్‌ జగన్మోహన రెడ్డితో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రమాణం చేయిస్తారు. à°ˆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, సీపీఐ, సీపీఎం జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు హాజరవుతున్నారు. అనంతరం వైఎస్‌ జగన్మోహనరెడ్డి తన ప్రభుత్వ ప్రాధామ్యాలపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. స్వతహాగా మిత ప్రసంగాలను జగన్‌ ఇష్టపడతారు. దానికి తగినట్టే ఆయన తన ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేసుకొన్నారని సమాచారం. జగన్‌ ప్రమాణం, ప్రసంగాలను దాదాపు 30 వేలమంది వీక్షించేందుకు వీలుగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు.
 
 
స్టేడియం మధ్యలో ప్రధాన వేదిక నిర్మించారు. దానికి అభిముఖంగా వీవీఐపీలు, వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులు, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు కూర్చోటానికి 18 గ్యాలరీలను సిద్ధం చేశారు. అక్కడ 12 వేల మంది కూర్చొనేందుకు వీలుంటుంది. స్టేడియం చుట్టూ ఏర్పాటుచేసిన మరో 20 గ్యాలరీల్లో ఇంకో 15 వేలమంది పడతారు. à°ˆ గ్యాలరీలను వైసీపీ జెండాలోని నీలం, ఆకుపచ్చ, తెలుపురంగుల పరదాలతో కప్పేశారు. మొత్తం 11,500 పాసులను అధికారులు జారీచేశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు ఖర్చు పెద్దగా కాకుండా చూడాలని జగన్‌.. సీఎ్‌సకు గట్టి ఆదేశాలు ఇచ్చారు. à°ˆ మేరకు మాన్యువల్‌à°—à°¾ పనులు చేయిస్తుండటంతో ఏర్పాట్లు సకాలంలో పూర్తి కావటానికి జాప్యమైంది. నాలుగు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్పప్పటికీ బుధవారం రాత్రికి కాని పూర్తికాలేదు. అసలే రోహిణి కార్తె! విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి.
 
 
జగన్‌ ప్రమాణ స్వీకారం కూడా మధ్యాహ్నం కావటంతో.. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఉండటానికి ఏసీలు, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. చల్లటి మజ్జిగ, లస్సీ, లడ్డూ, వడలతో కూడిన స్నాక్స్‌ వంటివి అందుబాటులో ఉంచారు. బెజవాడలోని వివిధ కూడళ్ళలో ఏర్పాటు చేసే బిగ్‌ స్ర్కీన్ల దగ్గర టెంట్లలో వీక్షించే ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారని భావిస్తున్నారు. రాయలసీమ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వస్తే.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయటానికి 2లక్షల మందికి మజ్జిగ, లస్సీ ప్యాకెట్లను అందించే ఏర్పాట్లను పౌర సరఫరాల విభాగం చేపట్టింది.
 
ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయనీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం వేతనం నెలకు రూ.2.5 లక్షలు. ఇతర అలవెన్సులను కూడా కలిపితే 4-5 లక్షల దాకా అందుతుంది. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకునేవారు.
 
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. త్వరగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి యోచిస్తున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. à°ˆ నేపథ్యంలో జూన్‌ మూడో తేదీనే మంత్రివర్గ విస్తరణ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.