రెండోసారి ప్రధానిగా ప్రమాణం..

Published: Friday May 31, 2019
 
మహాద్భుత విజయంతో సంచలనం సృష్టించిన నరేంద్ర మోదీ గురువారంనాడు రెండోసారి దేశప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌ ఆవరణలోని విశాల ప్రాంగణంలో విద్యుద్దీప కాంతుల నడుమ ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. సరిగ్గా రాత్రి 7 గంటలకు ఆయన లాంఽఛనంగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. 2014 కంటే ఎక్కువ మెజారిటీ సాధించిన ఆయన 1984 తరువాత అత్యధిక స్థాఽనాలు సొంతంగా గెల్చిన పార్టీ నేతగా అధికారం చేపట్టడం విశేషం. చాలా ఆర్భాటంగా సాగిన à°ˆ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 6000 మందికి పైగా హాజరయ్యారు. కుర్తా పైజమా ధరించి, హిందీలో స్ఫుటంగా మోదీ ప్రమాణం చేశారు. దీనికి ముందు- ఆయన à°† ప్రాంగణానికి చేరుకున్న వెంటనే ఆహూతులందరికీ (తద్వారా దేశ ప్రజానీకానికి) పూర్తిగా వంగి నమస్కారం చేశారు. బీజేపీ-సారథ్యంలోని à°ˆ ఎన్‌డీఏ సర్కారులో మొత్తం 57 మందికి మంత్రులుగా అవకాశమిచ్చారు. వీరిలో 36 మంది గతంలో చేసినవారే కాగా 21 మంది కొత్తవారు. మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. 9 మందికి స్వతంత్ర ప్రతిపత్తితో మంత్రులను చేశారు. మోదీ తరువాత సీనియారిటీ జాబితాలో ప్రథమస్థానంలో ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రమాణస్వీకారం చేశారు.
 
ఆయనను హోంశాఖ మంత్రిగానే కొనసాగించనున్నారు. అంతా ఊహించినట్లే అమిత్‌ షాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు ఆర్థికశాఖను ఇవ్వాలని ప్రధాని యోచిస్తున్నారు. అనారోగ్యంతో అరుణ్‌ జైట్లీ తప్పుకోవడంతో à°† స్థానాన్ని పీయూష్‌ గోయెల్‌కు ఇస్తారని తొలుత భావించారు. కానీ షాను ఎంపిక చేయడం ద్వారా ఇక పాలనా వ్యవహారాలన్నీ ఆయన ద్వారా జరుపుతామని మోదీ సంకేతాలిచ్చారు. కేబినెట్లోకి మరో అనూహ్యమైన ఆశ్చర్యకరమైన ఎంట్రీ.. విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యన్‌ జైశంకర్‌. 36 ఏళ్ల పాటు దౌత్యవేత్తగా కీలక సేవలు అందించిన ఆయన మోదీకి సన్నిహితుడు. ఈసారి కేబినెట్లో సుష్మా స్వరాజ్‌ లేకపోవడంతో ఆయనను విదేశాంగ మంత్రిగా చేయవచ్చని వినిపిస్తోంది. మోదీకి ప్రత్యామ్నాయంగా సంఘ్‌ అనుకూల వర్గాల్లో ప్రచారం జరిగిన నితిన్‌ గడ్కరీని మళ్లీ తీసుకున్నారు. అమేఠీలో రాహుల్‌గాంధీని à°“à°¡à°¿à°‚à°šà°¿à°¨ స్మృతీ జుబిన్‌ ఇరానీని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మైనారిటీ కోటాలో ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి స్థానం కల్పించారు.
 
అమిత్‌ à°·à°¾ పేరు పిలవగానే ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి హర్షఽధ్వానాలు వ్యక్తమయ్యాయి. స్మృతీ ఇరానీని పేరు పిలిచినపుడూ అదే స్పందన. సహాయమంత్రిగా బాలాసోర్‌ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి పేరు పిలిచినపుడు హాజరైన అనేకమంది లేచి నుంచొని హర్షధ్వానం చేయడం విశేషం. కేవలం à°“ పూరి గుడిసెలో నివసిస్తూ అత్యంత సామాన్యమైన జీవనం గడిపే సారంగికి ఇంత స్పందన లభిస్తుందని అగ్రనేతలెవరూ ఊహించలేదు ఇక సహాయమంత్రులుగా చేరిన వారిలో తెలంగాణకు చెందిన సికింద్రాబాద్‌ ఎంపీ జీ కిషన్‌రెడ్డి, మాజీ ఆర్మీ ఛీఫ్‌ వీకే సింగ్‌, బాబుల్‌ సుప్రియో, రామ్‌దాస్‌ అథఽవలే, అర్జున్‌ మేఘవాల్‌, అశ్వనీ చౌబే మొదలైన ప్రముఖులున్నారు. వీరిలో ఎక్కువ మంది కొత్తవారు. మోదీతో పాటు రాజ్‌నాథ్‌, సదానంద గౌడ, అర్జున్‌ముండా, రమేష్‌ పొఖ్రియాల్‌ గతంలో సీఎంలుగా చేశారు.