చంద్రబాబు తీసుకొచ్చిన చట్టసవరణ రద్దు

Published: Saturday June 01, 2019

రాష్ట్ర ప్రభుత్వాల కన్సెంట్‌ లేకుండా ఆయా రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అధికారంలేని సీబీఐకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణను జగన్‌ సర్కారు రద్దు చేయబోతోంది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏరాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఆయా కేసులకు సంబంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో కన్సెంట్‌ తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయ కక్ష సాధించేందుకు వినియోగిస్తోందన్న ఆరోపణలతో à°—à°¤ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కన్సెంట్‌ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో, సీబీఐ ప్రవేశానికి పాత మార్గాన్నే చూపబోతోంది.