2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం

Published: Saturday June 01, 2019
వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేపడతామని à°† పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా మద్యం దుకాణాలను దశలవారీగా ఎత్తివేసే దిశగా కొత్త పాలసీని తీసుకురావాలని తాజాగా యోచిస్తోంది. à°—à°¤ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ గడువు జూన్‌ నెలాఖరుతో ముగుస్తుంది. à°ˆ నేపథ్యంలో రానున్న రెండేళ్లకు కొత్త మద్యం పాలసీని రూపొందించాల్సి ఉంది. దీనిపై ఎక్సైజ్‌ శాఖ ఎప్పటి నుంచో కసరత్తు ప్రారంభించినా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం అంశాన్ని తెరపైకి తేవడంతో ఎలాంటి విధానం తీసుకొస్తారోనని అధికారులు ఎదురుచూస్తున్నారు. జూలై నుంచి అమలులోకి రానున్న కొత్త పాలసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం పాపులున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే జనాభా ప్రకారం పట్టణాలు, గ్రామాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మద్యం షాపులన్నిటినీ ఒకేసారి రద్దు చేయకుండా క్రమంగా తగ్గించే విధంగా ప్రభుత్వ కసరత్తు ఉండనుంది. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో 100 శాతం మద్యం షాపులు ఎత్తివేసి.. మద్యపాన నిషేధం అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
 
రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్‌ శాఖ నుంచే భారీగా ఆదాయం వస్తోంది. ఏటా రూ.14 వేల కోట్ల ఆదాయాన్ని à°ˆ శాఖ ప్రభుత్వానికి అందిస్తోంది. అంటే ఐదేళ్లకు రూ.70 వేల కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఒకేసారి మద్యపాన నిషేధం చేపడితే రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఏటా 20 శాతం షాపులు రద్దు చేయడం వల్ల తగ్గే ఆదాయాన్ని వేరే మార్గంలో ఆర్జించాలని యోచిస్తోంది. లైసెన్స్‌ ఫీజులతో పాటు మద్యం రేట్లు కూడా భారీగా పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేట్లు పెంచడం వల్ల మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని.. à°† విధంగానైనా మద్యపాన నిషేధం కొంత వరకూ అమలవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. మద్యపాన నిషేధంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. మద్యం పాలసీ గడువు ముగుస్తున్నందున సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను వారు తెప్పించుకున్నారు. శనివారం జరిగే ఎక్సైజ్‌ సమీక్షలో à°† రాష్ట్రాలు అమలు చేస్తున్న పాలసీలనే సీఎంకు వివరించనున్నారు.
 
 
ప్రభుత్వం మద్యపాన నిషేధంపై తీవ్రమైన కసరత్తు చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం పాత పాలసీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యం పాలసీని వారు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. à°—à°¤ పాలసీలో జీఎస్టీని తప్పించుకునేందుకు ఎక్సైజ్‌ అధికారులు లైసెన్స్‌ ఫీజును నాలుగింట మూడొంతులు తగ్గించారు. తగ్గించిన దాన్ని మరో రూపంలో రాబట్టుకునేందుకు లైసెన్స్‌లకు మార్జిన్‌ (కోత) విధించారు. మార్జిన్‌ను 23 నుంచి 10 శాతానికి కుదించారు. దీంతో పాటు అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ అనే కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. లాభం తగ్గించి, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ వేయడం వల్ల వ్యాపారులపై తీవ్రమైన భారం పడింది. దీనివల్ల తమకు తీవ్రంగా నష్టం వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. షాపులపై భారీగా లైసెన్స్‌ ఫీజులు కట్టించుకున్నా ఫర్వాలేదని.. పాత విధానమే అమలు చేయాలని వారు కోరుతున్నారు.