ఇక ప్రభుత్వ డిపోల నుంచి ఇసుక సరఫరా

Published: Monday June 03, 2019
 à°‰à°šà°¿à°¤ ఇసుక విధానాన్ని రద్దుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఉచిత విధానం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయకపోగా.. ఇసుక రవాణా ధరలను ఆకాశాన్నంటేలా చేసిందని ఆయన భావిస్తున్నారు. రీచ్‌లు మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయాయని.. à°ˆ పరిస్థితుల్లో కొత్త ఇసుక విధానం తీసుకురావలసిన అవసరం ఉందని గట్టిగా అభిప్రాయపడుతున్నారు. శనివారం ఆదాయార్జన శాఖలతో జరిపిన సమీక్ష సందర్భంగా తన వైఖరిని అధికారులకు ఆయన విడమరచి చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉంటూనే.. సామాన్యులకు అందుబాటు ధరలో ఇసుక లభ్యమయ్యేలా నూతన విధానం తయారు చేయాలని గనుల శాఖను ఆదేశించారు. à°ˆ నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు తరహాలో ప్రభుత్వ డిపోల ద్వారా అవసరమైన ఇసుకను సరఫరా చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ.. ఇసుక రీచ్‌లను గుర్తించి.. డిపోలు ఏర్పాటు చేసింది.
 
నిర్మాణాలు చేపట్టేవారికి వారి అవసరాలకు తగినట్లుగా ఇసుకను యూనిట్ల వారీగా విక్రయిస్తోంది. తమిళనాడులోనూ ఇదే తరహాలో ప్రభుత్వమే డిపోల ద్వారా ఇసుక విక్రయాలు జరుపుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఇసుక విక్రయ విధానాన్ని అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదికను అందించేందుకు గనుల శాఖ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలోనే రాష్ట్రంలోని ఏపీఎండీసీ డిపోల ద్వారా ఇసుక విక్రయ విధానం అమలు చేయడం మంచిదని ప్రభుత్వ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను గుర్తించి అక్కడ ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో డిపోలను ఏర్పాటు చేసి.. నిర్మాణాలు చేపట్టే వ్యక్తులు, సంస్థలకు ఇసుకను సరఫరా చేయాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఇసుక మాఫియా వల్ల చెడ్డ పేరు రాకుండా నివారించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. యూనిట్‌ ధరను ఖరారు చేసి విక్రయించడం వల్ల.. ఇసుక అందరికీ అందుబాటులో ఉంటుందని.. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నాయి.
 
2014à°•à°¿ ముందు ఇసుక రీచ్‌లను గనుల శాఖ గుర్తించి వేలం వేసేది. పాటపాడుకున్నవారు à°† రీచ్‌à°² నుంచి ఇసుకను విక్రయించేవారు. అడ్డగోలు ధరలకు విక్రయించకుండా గనుల శాఖ నిరంతరం పర్యవేక్షించేది. 2014లో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇసుక రీచ్‌à°² నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. à°ˆ సంఘాలకు ఎలాంటి అనుభవం లేకపోవడంతో స్థానిక రాజకీయ నాయకులు చక్రం తిప్పారు. ఇష్టానుసారం ఇసుక రేట్లు పెంచేసి అమ్మారు. ధరలు నానాటికీ పెరిగిపోయాయి. డ్వాక్రా సంఘాల ప్రయోగం విఫలం కావడంతో చంద్రబాబు 2017లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. ఎవరు ఏ రీచ్‌ నుంచైనా ఇసుక తవ్వుకోవచ్చని, అయితే రవాణా ఖర్చులు నిర్మాణదారులు పెట్టుకోవాలని కొత్త విధానం తెచ్చారు. అంతకుముం దు నిర్దిష్ట ఇసుక రీచ్‌లు గనుల శాఖ పర్యవేక్షణలో ఉండేవి. ఉచిత ఇసుక పేరిట అన్ని రీచ్‌లను ఓపెన్‌ చేయడంతో.. à°† శాఖ పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పుకొంది. దీంతో రీచ్‌లన్నీ స్థానిక ఎమ్మెల్యేలు, నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దాంతో ఇసుక ధర కొండెక్కింది.