బాలకృష్ణ చేతిలో ఓడిన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ చాన్స్‌

Published: Tuesday June 04, 2019
హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలైన మాజీ ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ పదవి వరించనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు విజయవాడ పార్లమెంటు వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఆయనను హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణపై పోటీ చేయించారు. అయితే ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. à°ˆ క్రమంలో సోమవారం రాత్రి గుంటూరులో ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో మహ్మద్‌ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నటు సీఎం ప్రకటించారు. కర్నూలు జిల్లావాసి అయిన ఇక్బాల్‌ ఐజీగా రిటైర్‌ అయిన కొద్దిరోజులకే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
 
 
అనంతరం విజయవాడ పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. తనకు కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమివ్వాలని అప్పట్లో ఆయన కోరారు. అయితే హిందూపురం వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇక్బాల్‌ను హిందూపురం వైసీపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. కానీ, చివరికి ఆయన ఓటమి చవిచూశారు. à°’à°• వేళ ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని గతంలోనే జగన్‌ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ అవకాశం లభించినట్లయిందని à°† పార్టీ నాయకులు పేర్కొంటున్నారు