ఇప్పటిదాకా నా ఆశయాలే చూశారు... ఇక రాజకీయాలు కూడా చూస్తారు: పవన్‌

Published: Monday June 10, 2019
రాజకీయాల్లోకి చాలా ఇష్టంతో à°µ చ్చా.. ప్రయత్నం చేయకపోతే సమాజం మారదన్న ఉద్దేశంతోనే పార్టీ స్థాపించా.. మార్పు ఎందుకు రాదో చూస్తా. పదవి వెంట నేను పరుగు పెట్టను. పదవే నా వద్దకు పరుగున వచ్చేవరకూ పోరాటం ఆపను’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మూడు రోజులుగా పలు జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమీక్షిస్తున్నారు. ఆదివారం సమావేశమై.. ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘పాతికేళ్ల లక్ష్యంతో వచ్చాను. తుది శ్వాస వరకు పార్టీని నడుపుతా. ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయామని అంటున్నారు.. ముందు కొన్నై నా ఓట్లు వచ్చినందుకు సంతోషించండి. నమ్మి జనం ఓట్లేశారు.. నాకొచ్చి à°¨ ప్రతి ఓటూ వంద ఓట్లతో సమానం. జనసేన సీట్లు గెలవకపోయినా స్వచ్ఛమైన మనుషుల మనసు గెలుచుకుంది. నన్ను ఓడించేందుకు భీమవరం అసెంబ్లీ స్థానం పరిధిలోని ఒక్క వీరవాసం మండలంలోనే రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ నా ఆశయాలే చూశారు. ఇకపై నా రాజకీయాలు కూడా చూస్తారు. దెబ్బకు దెబ్బ తీస్తా’ అని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి జనసేన ఉందనే నమ్మకం ప్రజల్లో కలగాలని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో ఏకీభవించే ప్రసక్తేలేదన్నారు. ప్రధాని మోదీ అంటే గౌరవం ఉందని.. భయం మాత్రం లేదని స్పష్టం చేశారు.
 
2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి తనతో పాటు జన సైనికులు మాత్రమే నడిచారని, 2019లో నాయకులు కూడా పార్టీలోకి వచ్చి చేరారని పవన్‌ అన్నారు. ఇప్పుడే జనసేన అసలైన రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిందని చెప్పారు. ‘ఇదే మనకు సరైన అవకాశం. దెబ్బలు తిని ఓటమి ఎదురైనప్పుడే ఎవరు నిలబడతారు, ఎవరు పారిపోతారో తేలుతుంది. గెలుపులో అందరూ ఉంటారు. ఓటమిలో తోడుండేవారే అసలైన జన సైనికులు... మీరందరూ వెళ్లిపోయినా తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఒక్కడినే ఉం à°Ÿà°¾. కష్టంగా ఉన్నంత మాత్రాన పార్టీని వదిలేదిలేదు. చివరి శ్వాస వర కూ నడిపిస్తా’ అని ఆవేశపూరితంగా మాట్లాడారు. తానెప్పుడూ అవివేకంతో మాట్లాడనన్నారు. ‘కసి, పౌరుషం లేకుంటే రాజకీయాల్లోకి ఎందుకొస్తాం? నిలబడడానికి, జెండా పాతడానికి, జెండా ఎగురవేయడానికే వచ్చాం. జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు స్థాపించలేదో చేసి చూపిస్తా’ అని కేడర్‌లో స్థైర్యాన్ని నింపేలా వ్యాఖ్యానించారు.