ఆర్టీసీకి మున్సిపాల్టీ తరహాలో ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఆలోచన

Published: Monday June 10, 2019
వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి కష్టాలకు ఎదురీదుతున్న ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రవాణా, సమాచారశాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నా రు. రానున్న కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమ్మెకూడా ఉండకపోవచ్చని చెప్పారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పద వి చేపట్టి ఒక్కరోజే అయినా తన వద్ద ఉన్న సమాచారం, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసీని ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందన్నారు. ఆర్టీసీలో 53 నుంచి 54 వేలమంది ఉద్యోగులు, సిబ్బందికి వేతనాల రూపంలో నెలకు రూ.100 కోట్లు ఇవ్వాల్సి వస్తోందన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వమే చెల్లించే ఆలోచన చేస్తున్నామని నాని చెప్పారు.
 
ఆర్టీసీ రూ. 6,900 కోట్ల అప్పుల్లో ఉందని మంత్రి నాని చెప్పారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సొసైటీల ద్వారా రుణాలు తీసుకుని తమ వేతనాల నుంచి బకాయిలు చెల్లిస్తున్నా à°† సొమ్ము సంబంధిత సొసైటీల్లో జమచేయకుండా సంస్థ ఆర్థికపరమైన అవసరాలకు వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు తనఖాపెట్టి చేసిన అప్పులు, తదితరాలు మొత్తం రూ. 6,900 కోట్లుగా ఉందన్నారు. డీజిల్‌ వినియోగంలో అవకతవకలు, రాజకీయ కారణాలతో బస్సు చార్జీలు పెంచకపోవడం వలన ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు. ఆర్టీసీ ఏడాదికి 13 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోందన్నారు. à°—à°¤ ప్రభుత్వం డీజిల్‌పై రూ.2 మేర సర్‌చార్జీ విధించడం, సేల్స్‌ట్యాక్స్‌తో ఆర్టీసీపై కొంతమేర ఆర్థికభారం పడిందన్నారు.
 
ఏపీలో 83 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉందని.. ఈ విషయంలో దేశంలోనే తొలిస్థానంలో ఉన్నామని మంత్రి చెప్పారు. కాగా.. వైసీపీ పాలనలో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ, సమీకరణ ఉందడని మంత్రి చెప్పారు. భూమిని తీసుకోవాల్సి వస్తే రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించి వారి ఆమోదంతోనే సేకరిస్తామన్నారు.
 
సమాచారశాఖ మంత్రిగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరి బాగోగులు చూసుకోవడం తమ బాధ్యతని నాని అన్నారు. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల విద్యలో సగం రాయితీ ఇవ్వకుండా కొన్ని విద్యాసంస్థలు దాటవేత ధోరణిని అవలంబిస్తు న్న విషయం తన పరిశీలనకు వచ్చిందన్నారు. ఈ అంశంపై ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసి పకడ్బందీగా అమలు జరిగేలా చూస్తామన్నారు. జర్నలిస్టులకు గృహాల కేటాయింపులోనూ పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. వాస్తవాలను పరిశీలించి అద్దె గృహాల్లో ఉండేవారికి తొలుత గృహాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.