ఆర్టీసీ విలీనంపై నా హామీ నెరవేరాలి

Published: Tuesday June 11, 2019
 à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚పై అవినీతి ముద్ర పడేందుకు ఎంతమాత్రం వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. ఏ మంత్రిపైనైనా అవినీతి అరోపణలు వస్తే.. తక్షణమే వారిని మంత్రివర్గం నుంచి తొలగిస్తానని తేల్చిచెప్పారు. రెండున్నరేళ్లపాటు మంత్రులుగా కొనసాగుతామని భావించి ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. సోమవారం దాదాపు ఐదున్నర గంటలపాటు జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రిగా తన ప్రాధాన్యాలను, విధానాలను జగన్‌ స్పష్టం చేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ‘‘చంద్రబాబు పాలనలో ప్రతి శాఖలో అవినీతి రాజ్యమేలింది. ప్రజలు మార్పు కోరుకుని వైసీపీకి à°…à°–à°‚à°¡ విజయాన్ని అందించారు. ప్రజల విశ్వాసం కొనసాగాలంటే ప్రభుత్వానికి అవినీతి చీడ అంటేందుకు వీల్లేదు. ప్రధానంగా మంత్రుల నడవడికను ప్రజలందరూ గ్రహిస్తున్నారని గుర్తించాలి. అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వెంటనే పీకిపారేస్తా’’ అని జగన్‌ సూటిగా చెప్పినట్లు తెలిసింది.
 
అధికారిక నివేదికలు, సమాచారాన్ని మంత్రులకు ఇవ్వకుండా నేరుగా తన వద్దకు పంపవద్దని అధికారులకు జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై రూపొందించిన నివేదికను కేబినెట్‌లో సీఎం పరిశీలించారు. ‘మీరు దీనిని చదివారా?’ అని రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని ప్రశ్నించారు. తాను à°† నివేదికను చూడలేదని మంత్రి బదులిచ్చారు. దీంతో... తన మంత్రివర్గ సభ్యులు డమ్మీలు కాదని, శాఖాపరమైన ప్రతి అంశమూ వారికి తెలియాల్సిందే జగన్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ముందుగా మంత్రికి తెలియజేశాకే.. à°† మంత్రి ద్వారా తన వద్దకు సమాచారాన్ని తీసుకురావాలన్నారు. నివేదిక తయారు చేసిన నాటి నుంచి ముగించేంతవరకూ మంత్రికి తెలిసే జరగాలని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై మంత్రులు, అధికారుల అభిప్రాయాలను జగన్‌ సేకరించారు. సంస్థను కార్పొరేషన్‌లాగా ఉం చుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో జీత భత్యాలు చెల్లిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే... పాదయాత్ర సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు తాను ఇచ్చిన హామీ నెరవేరేలా నిర్ణీత కాలవ్యవధిలోగా నివేదికను సిద్ధం చేయాలని జగన్‌ ఆదేశించారు.
 
 
అక్టోబరు రెండో తేదీ నుంచి ‘రైతు భరోసా’ à°•à°¿à°‚à°¦ రూ.12,500 ఇవ్వడంపై కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అక్టోబరు నాటికి వ్యవసాయ పనులు అయిపోతాయని, à°† సమయంలో సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో జగన్‌ ఏకీభవించలేదు. ‘‘పనులు పూర్తయినప్పటికీ... సాగుకోసం చేసిన ఖర్చుల à°•à°¿à°‚à°¦ ప్రభుత్వ సహాయం అందుతుంది. ఇందులో తప్పేమీ లేదు’’ అని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.18వేల వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనపై కొందరు అధికారులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. వారి వాదనను జగన్‌ తోసిపుచ్చారు. ‘‘డబ్బులు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన మీరు కానీ, నేను కానీ మురుగు కాలువలో దిగం. పారిశుధ్య కార్మికులు చేసే పనిని మానవీయ కోణంలో చూడాలి’’ అని స్పష్టం చేసినట్లు తెలిసింది.