తన కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచి పద్ధతి కాదు

Published: Wednesday June 12, 2019

స్పీకర్‌à°—à°¾ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించానని కోడెల శివప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు వల్లే తనకు ఇన్ని పదవులు వచ్చాయని తెలిపారు. తన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని గతంలోనే చెప్పానన్నారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తనపై చేసిన ఆరోపణలపై ఒక్క ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పధకం ప్రకారమే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తామంటే సహకరిస్తామన్నారు. అక్రమాలు చేస్తే మాత్రం పోరాటాలు చేస్తామన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరించినప్పుడు సభకు రావాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు.