రాష్ట్రంలో ఇసుక ‘తుఫాన్‌’

Published: Wednesday June 12, 2019
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు, తరలింపును తక్షణమే నిలిపివేయాలని పంచాయతీరాజ్‌, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక తవ్వకాలను, రవాణాను వచ్చే 15 రోజులుపాటు నిషేఽధించినట్టు వెల్లడించారు. జూలై 1à°µ తేదీ నాటికి నూతన ఇసుక విధానం రూపొందిస్తామని, అప్పటిదాకా à°ˆ నిషేధం అమలులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పీడీయాక్టు à°•à°¿à°‚à°¦ కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో గనులశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
‘‘ ఇతర రాష్ట్రాల్లో ఆదాయం మైనింగ్‌శాఖ నుంచి దాదాపు 20 నుంచి 25 శాతం వరకు ఉంటే మనరాష్ట్రంలో అది చాలా నామమాత్రంగా ఉంది. దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించాను. కనీసం 25 శాతం ఆదాయం శాఖ నుంచి లభించేలా చూడాల్సి ఉంది. అదే సమయంలో సామాన్యులపై భారం పడకుండా చూసుకోవాలి. దీనిపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయో అధ్యయనం చేసి, జూలై 1 తేదీ నాటికి కొత్త ఇసుక విధానం ప్రకటిస్తాం. à°ˆ విధానం రూపకల్పనలో జిల్లా అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లలను భాగస్వాములను చేస్తాం. à°—à°¤ ఏడాది కాలంలో రూ. 2,643 కోట్ల ఆదాయం శాఖ నుంచి లభించింది. దానిని మరింత పెంచడంపై కేంద్రీకరిస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.
 
à°ˆ విధానం అమల్లోకి వచ్చేదాకా.. ఎక్కడ వెలికి తీసిన ఇసుకను ఎక్కడే ఉంచాలని, ఇసుక తరలించే వాహనాలను సీజ్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వడం సాగిందని ఆరోపించారు. దీనివల్ల à°—à°¤ ఏడాది రాష్ట్రంలో 202 రీచ్‌లు ఉండగా, ఇప్పుడు అవి 116à°•à°¿ కుదించుకుపోయాయన్నారు. à°ˆ పాపమే చాలాచోట్ల టీడీపీ నేతలకు తగిలి, వారంతా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ‘‘à°—à°¤ ఐదేళ్లలో చంద్రబాబు ఆధ్వర్యంలో వేలాది కోట్ల ఖనిజ సంపద దోచుకున్నారు. రాష్ట్రంలో నదుల నుంచి తవ్వితీసిన ఇసుకను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు అక్రమంగా తరలించి టీడీపీ నేతలు కోట్లు పోగేసుకున్నారు. ఉచిత ఇసుక విధానంతో ప్రభుత్వానికి నష్టం వస్తే, టీడీపీ నేతలు మాత్రం లాభపడ్డారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఇసుక దోపిడీ వల్లే టీడీపీ ఓడిపోయింది. గ్రామాల్లో వార్డుమెంబర్లుగా ఓడిపోయిన వారిని కూడా టీడీపీ గ్రామ జన్మభూమి కమిటీల్లో నియమించింది.’’ అని మంత్రి ఆరోపించారు. తమ పాలన పారదర్శకంగా ఉంటుందని, గ్రామ వలంటీర్లను పార్టీలకు అతీతంగా నియమిస్తామని మంత్రి స్పష్ట్రం చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తే జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కాగా, పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అంశంపై తామింకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.