ఆర్టీసీ జేఏసీకి సీఎం జగన్‌ భరోసా

Published: Thursday June 13, 2019
ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల à°•à°² ఫలించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమను గుర్తించాలన్న ఏళ్లనాటి వారి డిమాండ్‌ ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. ప్రజారవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేయడంతో ఆర్టీసీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో తనను కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులకు à°ˆ మేరకు సీఎం భరోసా ఇచ్చారు. దీంతో à°ˆ నెల 13 నుంచి తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు పలిశెట్టి దామోదర్‌ రావు, వైవీ రావు, సుందరయ్య, నాయుడు తదితరులు ఉమ్మడి ప్రకటన చేశారు.
 
 
ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ ఇబ్బందుల గురించి వివరించేందుకు à°Žà°‚à°¡à±€ సురేంద్రబాబు, జేఏసీ నేతలు బుధవారం అసెంబ్లీలో సీఎంను కలిసేందుకు వచ్చారు. ఎమ్మెల్యేగా మొదట ప్రమాణం చేసిన సీఎం జగన్‌ కాసేపటికి అసెంబ్లీలోని తన చాంబర్‌కు చేరుకున్నారు. à°† సమయంలో జేఏసీ నాయకులు సీఎం వద్దకొచ్చి ఆర్టీసీ కష్టాల గురించి వివరించబోయారు. సంస్థ రూ.7వేలకోట్ల నష్టాల్లో ఉందని చెప్పబోతుండగా ‘అవన్నీ మీకెందుకు.. అప్పుల సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది’ అని సీఎం బదులిచ్చారు. కార్మికుల కష్టాలు వివరించేందుకు ప్రయత్నించగా.. ‘మీరు ఇంకా కార్పొరేషన్‌ ఉద్యోగులే అనుకోవద్దు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు. నేను మాటిచ్చా ఆర్టీసీని విలీనం చేస్తానని. 90 రోజుల్లో పూర్తవుతుంది. మీరు బస్సులు నడపండి. ప్రజలకు మెరుగైన ప్రయాణ సేవలు అందించండి’ అని ముఖ్యమంత్రి జగన్‌ అనగానే జేఏసీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
 
 
అయితే ఇప్పటి వరకూ నిర్వహణ కోసం తమ సీసీఎస్‌ డబ్బులు యాజమాన్యం వాడుకుందని, à°† డబ్బులు ప్రభుత్వం ఇస్తేనే ఇస్తామంటూ అధికారులు చేతులెత్తేశారని జేఏసీ నేతలు గుర్తు చేయగా.. ‘ఇది కచ్చితంగా పరిష్కరిస్తాం. ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడండి’ అంటూ అక్కడే ఉన్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి à°Žà°‚.à°Ÿà°¿. కృష్ణబాబు, ఆర్టీసీ à°Žà°‚à°¡à±€ సురేంద్రబాబు వైపుచూస్తూ సీఎం సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల జగన్‌కు జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎంతో భేటీ తర్వాత అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులపట్ల ముఖ్యమంత్రికి à°Žà°‚à°¤ ప్రేమ ఉందో ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం రుజువు చేస్తోందని వైఎ్‌సఆర్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు చల్లా చంద్రయ్య, రాజారెడ్డి, డీఎస్పీ రావు à°’à°• ప్రకటనలో తెలిపారు.