నేతలకు మస్కా కొట్టిన నలుగురు అరెస్టు

Published: Thursday June 20, 2019
వైసీపీ, టీడీపీ అధినేతల కోర్‌ టీమ్‌ లీడర్‌నంటూ ఎన్నికల సమయంలో టికెట్‌ ఆశావహులకు ఫోన్లుచేసి లక్షలాది రూపాయలు వసూలుచేసిన ముఠా గుట్టు రట్టయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఆశించిన వారినుంచి డబ్బులు గుంజిన వ్యవహారంపై ‘టికెట్‌’ టోకరా’ పేరిట ఈనెల 18à°¨ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. à°ˆ ముఠాకు చెందిన నలుగురిని విశాఖ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు నగరంలోని à°’à°• ట్రాఫిక్‌ ఏఎ్‌సఐ కుమారుడు కావడం గమనార్హం.
 
సీపీ మహేశ్‌చంద్ర లడ్డా కథనం మేరకు... గాజువాక శ్రీనగర్‌ అఫీషియల్‌ కాలనీకి చెందిన పాండ్రంకి విష్ణుమూర్తి అలియాస్‌ సాగర్‌(27) ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ కుమారుడు. వ్యసనాలకు బానిసై బీటెక్‌ మధ్యలోనే మానేశాడు. స్పూఫ్‌ కాల్స్‌ (దేశ, విదేశాల్లోని ప్రముఖులు, సామాన్యుల గొంతులతో వారి నంబరు నుంచే ఎంపిక చేసుకున్న వ్యక్తులకు వాట్సాప్‌ కాల్‌ చేయడం)కు సంబంధించిన సైబర్‌ నేరగాళ్ల గ్రూప్‌లో అతడికి ప్రవేశం లభించింది. గవర్నర్‌ నరసింహన్‌, ముఖేశ్‌ అంబానీ వంటి ప్రముఖుల నంబర్ల నుంచి వారి గొంతుతోనే మాట్లాడినట్టు తన స్నేహితుడి నంబర్‌కు ఫోన్‌ చేయాలని డార్క్‌సైట్‌ నిర్వాహకులను కోరాడు. వారు అలాగే చేయడంతో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని విష్ణుమూర్తి నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు, రౌడీషీటర్‌ గంధవరపు తరుణ్‌కుమార్‌ (30), పెదగంట్యాడకు చెందిన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ పీ జయకృష్ణ(24), శ్రీహరిపురానికి చెందిన మరడాన జగదీశ్‌(24)తో కలిసి à°ˆ జనవరిలోనే వ్యూహం పన్నాడు. మే 7à°¨ అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి ‘సీఎంగారు రూ.10లక్షలు పంపించమన్నారు.
 
 
మీకు విదేశీ నంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది, వారికి అందజేయాలి’అని చెప్పాడు. కొంతసేపటికే +1(865)2703145 నంబర్‌ నుంచి ఫోన్‌చేసి శ్రీనివాస్‌ మీ నంబర్‌ ఇచ్చారని, తాము స్టీల్‌ప్లాంట్‌ వద్ద వున్నామని చెప్పారు. నిజమేనని భావించిన బండారు తన డ్రైవర్‌ ద్వారా రూ.10లక్షలు పంపించారు. అలాగే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎంపీ మురళీమోహన్‌, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి,కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్‌, సుష్మాస్వరాజ్‌కు కూడా ఫోన్‌ చేసినా వాళ్లెవరూ నమ్మలేదు. వైసీపీ నేతలకు జగన్‌ పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడినట్టు అతని నంబర్‌ నుంచి పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, వైసీపీ పిఠాపురం సమన్వయకర్త దొరబాబు, హర్షవర్ధన్‌రెడ్డికి ఫోన్‌ చేసి డబ్బు సర్దాలని అడిగాడు. అప్పలరాజు రూ.15లక్షలను మర్రిపాలెంలోని అన్న క్యాంటీన్‌ వద్ద అందజేశారు.