ఆరోగ్యశ్రీ బలోపేతం దిశగా సుదీర్ఘ చర్చ

Published: Friday June 21, 2019
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందేలా సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యత తమపై ఉందని ఆరోగ్యశాఖలో సంస్కరణలపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్‌పర్సన్‌ కె.సుజాతారావు అన్నారు. కమిటీ తొలిభేటీ గురువారం సచివాయంలో జరిగింది. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి à°† ధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలకాంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశం మొత్తం ఆరోగ్యశ్రీ అమలు, భవిష్యత్‌ కార్యాచరణ, ఆరోగ్యశ్రీ ప్రక్షాళన దిశగా చర్చ సాగింది. సీఎం జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నవ రత్నాల హామీలో భాగంగా ఆరోగ్యశ్రీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో డాక్టర్‌ సుబ్బారావు సిద్ధం చేసి ప్రజెంటేషన్‌ను సభ్యులకు వివరించారు. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరో 969 శస్త్ర చికిత్సలు పెంచాలని ఆయన తెలిపారు.
 
 
హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరువంటి చోట్ల కూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై స్పందించిన కమిటీ చైర్‌పర్సన్‌ ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్ని నిధులు అవసరం, బడ్జెట్‌పై ఏమేరకు భారం పడుతుందనే దానిపై అధికా రులను ప్రశ్నించారు. జిల్లాస్థాయి ప్రభుత్వా సుపత్రుల్లో నెలరోజులపాటు కేసుల నమోదును పరిశీలించి పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌ ఆస్ప త్రులతోపాటు 20 పడకలున్న ఆస్పత్రుల్ని కూడా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే సేవలు మరింతగా విస్తరించే అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు రామచంద్రరావు సూచించారు. ఆరోగ్య మిత్రాల గురించి చైర్‌పర్సన్‌ సుజా తారావు ఆరాతీశారు. అవసరమైతే మరికొంత మందిని నియమించి సేవల్ని విస్తరించాలని ఆదేశించారు. తెలంగాణలో నివాసముంటున్న ఆంధ్ర ప్రజలకు à°ˆ పథకాన్ని విస్తరించే అంశంపైనా చర్చించారు. ఆరోగ్యశ్రీతో పాటు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, ఏపీవీవీపీ, డీఎంఈ, ఆయుష్‌ విభాగాలు, 108, 104 పథకాల అమలు తీరుపై కూడా చర్చించారు. 108 సేవలు పూర్తిగా మరుగున పడిపోయాయని కొందరు సభ్యులు చెప్పగా.. à°† వ్యవస్థను పటిష్టం చేయాలని సుజాతారావు ఆదేశించారు. 104, 108 వాహనాలను ఎన్జీవోలకు ఇవ్వాలా, ప్రభుత్వమే నిర్వహించాలా అన్న అంశాలపై కసరత్తు చేయాలన్నారు.