చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమే.....

Published: Sunday June 23, 2019
‘‘ప్రజావేదిక విషయంలో టీడీపీ నేతల రాజకీయం, రాద్ధాంతం ఏమిటి? టీడీపీ నిధులతో కానీ, చంద్రబాబు సొంత డబ్బుతో కానీ కట్టించారా? లేక ఆయన తండ్రి, తాత కట్టిన భవనాలా ఇవీ?’’ అంటూ మునిసిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికను మంత్రి సందర్శించారు. à°ˆ నెల 24à°¨ జరగనున్న కలెక్టర్ల సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు.
 
‘‘ప్రజావేదిక చంద్రబాబు సొంత డబ్బుతో కట్టింది కాదు. అది ఆయన తాతల ఆస్తి కూడా కాదు. à°ˆ రాష్ట్ర ప్రజలు నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కొత్త ప్రభుత్వం పరిపాలన ప్రారంభించింది. ఎన్నికల తర్వాత ఓటమి చెందిన వారు ప్రభుత్వానికి చెందినవన్నీ గౌరవంగా తిరిగి ఇచ్చేయడం సంప్రదా యం. ప్రజావేదికని ప్రభుత్వ ధనంతో కట్టారు. ఇది మాది, నా సొంతం అనే డైలాగులు ఏంటి? ఐదేళ్ల టీడీపీ పాలనలో కనీసం కలెక్టర్ల సమావేశం పెట్టడానికి ప్రజావేదిక తప్ప మరో భవనం లేదు. అధికారిక సమావేశాలకు సరైన భవనాలు లేవు. ఉన్నదాంట్లో వాడుకుంటే బాగుంటుందని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని బొత్స ప్రశ్నించారు.
 
ప్రజావేది à°• తనకు కేటాయించాలని చంద్రబాబు కోరినప్పుడు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుంది? అన్న ప్రశ్నకు బొత్స స్పందించారు. ‘‘సమాచారం దేనికివ్వాలి? ప్రజావేదికను చంద్రబాబు కోరడం సమంజసం కాదు. ప్రజావేదిక అక్రమ కట్టడం అయితే చంద్రబాబు నివా సం కూడా అక్రమ కట్టడమే. విపక్ష నేతకు à°—à°¤ ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇచ్చిందో మేమూ అలాంటి గౌరవమే ఇస్తాం’’ అని బొత్స స్పష్టం చేశారు.