డ్వాక్రా రుణ మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Published: Tuesday June 25, 2019
డ్వాక్రా రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు జిల్లాల వారీగా వివరాలు గడువులోగా సమర్పించాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. à°† మేరకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వెలుగు సిబ్బంది జాబితా సేకరణలో నిమగ్నమవుతున్నారు. సదరు రుణాలు మాఫీ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సభ్యులు తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయడానికి ఆయన సముఖత వ్యక్తం చేశారు. సకాలంలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపితే à°† మేరకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జిల్లాలో పొదుపు మహిళలు, రుణం తీసుకున్న సభ్యులు, అప్పు ఉన్న వారి వివరాలు పంపాలని సెర్ఫ్‌ నుంచి డీఆర్‌డీఏ కార్యాలయానికి ఆదేశాలందాయి. ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 11 తేదీ నాటికి సంఘాలకు చెందిన రుణాలు, అప్పుల బకాయిలపై పూర్తి వివరాలను అందజేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
జిల్లాలో గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ ప్రాంతాల వారీగా ప్రస్తుతం ఉన్న డ్వాక్రా సంఘాలు 94,236. వీటిలో 10,71,077 మంది సభ్యులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 51 మండలాల్లో 84,754 గ్రూపుల్లో 8,24,681 మంది సభ్యులు, ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 7,761 సంఘాల్లో 74,168 మంది సభ్యులు, మెప్మా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో 17,821 గ్రూపులకుగాను 1,72,228 మంది సభ్యులున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన గడువు నాటికి 72,321 స్వయం సహాయక సంఘాలు రుణాలు పొందినట్టు ప్రభుత్వం వద్ద నివేదికలున్నాయి. à°ˆ సంఘాల్లో సభ్యులంతా రూ.1,980.72 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మనుగడలో ఉన్న సంఘాలు, సభ్యుల ఆధార్‌ కార్డుల అనుసంధానంతో విచారించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని వెలుగు ఏపీఎంలకు జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలందాయి. విచారణ అనంతరం ఏపీఎం లాగిన్‌à°² నుంచి సెర్ఫ్‌ సంస్థకు వివరాలు పంపుతారు. ఇప్పటివరకు జిల్లాలో 40 వేల సంఘాల్లో సభ్యుల వివరాల విచారణ పూర్తయ్యిందని తెలుస్తోంది.