డ్యామ్‌ నిర్మాణంతో 34 గ్రామాలకు పొంచివున్న ముప్పు

Published: Wednesday June 26, 2019
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వందలాది గిరిజన గ్రామాలు గోదావరిలో కలిసిపోతాయి. దాంతో ఆయా గ్రామాలను ఖాళీ చేసే వారికి పునరావాసం కల్పించే దిశగా ప్రయత్నం జరుగుతోంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ à°•à°¿à°‚à°¦ వీరికి భూమికి భూమి, పునరావాస కాలనీలు నిర్మించి ఇవ్వాలి. అప్పుడే వారు ఆయా గ్రామాల నుంచి వైదొలుగుతారు. à°ˆ ప్రక్రియ ఏళ్ల తరబడి నిరంతరాయంగా సాగుతోంది. అయితే పునరావాస కాలనీ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ప్రాజెక్టు పూర్తయ్యాక తమ గ్రామాలు ఇక కనుమరుగవుతాయన్నది నిర్వాసితులందరికీ తెలుసు. అయితే ప్రాజెక్టు పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇప్పట్లో తమకేమీ ఇబ్బంది లేదని ఆయా గ్రామాల జనం భావిస్తూ వస్తున్నారు. నిజమే.. ప్రాజెక్టు పూర్తయి నీరందించే వరకు వీరికి వచ్చే ఇబ్బంది కూడా పెద్దగా లేదు. కానీ దేవీపట్నం మండలంలోని 34 గ్రామాలకు à°ˆ ఏడాదే జలదిగ్బంధనంలో చిక్కుకుపోయే పరిస్థితి వచ్చేసింది. గ్రామాలకు గ్రామాలే వరదల్లో మునుగుతాయని జనం హడలిపోతున్నారు. దీనిపై అప్రమత్తం చేయాల్సిన అధికారులు నుంచి కనీస స్పందన కూడా ఉండడం లేదు. స్పిల్‌వే, డైవర్షన్‌ చానెల్స్‌ పూర్తి కాకుండానే గోదావరి నదికి అడ్డంగా చేపడుతున్న కాఫర్‌డ్యామ్‌ వల్ల జూలై, ఆగస్టు నెలల్లో వచ్చే గోదావరి వరదలకు ఎన్నో గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతంలో పూర్తి చేసిన నిర్మాణాలు, మట్టితో వేసిన అడ్డుకట్టలతో ముప్పు తప్పదని ఆయా గిరిజన గ్రామాల జనం ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా వచ్చే వరద నీటి వల్ల దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురికావడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో వరద తీవ్రత అధికంగా ఉండడమేగాకుండా 34 గ్రామాలు మునిగిపోవడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు.
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యే 44 గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు ఆయా గ్రామాల్లోని నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. వీరికోసం కేటాయించాల్సిన పునరావాస కాలనీల నిర్మాణం కూడా పూర్తవ్వలేదు. పునరావాసం కల్పించిన తర్వాత ఆయా గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉండగా ఇప్పుడు ముంచుకొస్తున్న ముప్పుతో ఏమి చేయాలో అర్థంకాని అయోమయంలో ప్రజలు పడిపోయారు. గోదావరి వరదల సమయంలో తమకు ఎలాంటి ముప్పు ఉంటుందో చెప్పి, అప్రమత్తం చేయాల్సిన అధికారులు ఇప్పటిదాకా కనిపించకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏటా వరదల సమయంలో తమ గ్రామాల నుంచి గిరిజనులు కొండ బాట పడతారు. వరద తగ్గేదాకా తలదాచుకుంటారు. ఇప్పుడు పూర్తిగా జలదిగ్బంధనం అయితే ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు.
 
బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఇక్కడి వారు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెట్టిన అధికారులు ఇప్పుడు పొమ్మనకుండా పొగపెట్టే మాదిరిగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాఫర్‌ డ్యామ్‌తో ముంచుకొస్తున్న ముప్పు నుంచి తమకు ఆదుకునే చర్యలైనా తక్షణం చేపట్టాలని, ఏఏ గ్రామాలకు వరద ముప్పు అధికంగా ఉంటుందో అప్రమత్తం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. తమకు ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇప్పటికే ఇచ్చి, పునరావాస కాలనీలు నిర్మించి ఉంటే తమకు à°ˆ ఆందోళన ఉండేది కాదని, ఇప్పటికైనా పునరావాసంపై దృష్టి పెట్టాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు