కోస్తాకు భారీ వర్షసూచన

Published: Monday July 01, 2019
ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో à°ˆ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా à°† తరువాత వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఆదివారం ఒడిసాలో విస్తారంగా, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించి మధ్యాహ్నం నుంచి జల్లులు ప్రారంభమయ్యాయి. అయితే అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. అల్పపీడనంతో ఆది, సోమవారాలు ఒడిసాలో, సోమ, మంగళవారాల్లో ఛత్తీస్‌గఢ్‌, విదర్భ, జూలై 2à°¨ తెలంగాణలో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. కోస్తాలో ఆదివారం నుంచి మంగళవారం వరకు విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తా, ఒడిసాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
 
కాగా, బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో పడమర దిశగా మధ్యభారతం మీదుగా పయనిస్తున్నదని, దీంతో జూలై 4లోగా రుతుపవనాలు వాయవ్య, ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యభారతం దానికి ఆనుకుని మధ్య మహారాష్ట్ర, మరట్వాడా, కొంకణ్‌ వరకు భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.