కాలుష్యపు రక్కసి కోరల్లో తిరుమల

Published: Monday July 01, 2019
పచ్చని కొండలపై కాలుష్యం పంజా విసురుతోందా..? సప్తగి రుల్లో నిత్యం వినిపించే హరినామ ఘోష కన్నా à°°à°£ గొణ ధ్వనుల తీవ్రతే ఎక్కువగా ఉందా..? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టీటీడీకిచ్చిన నోటీసు చూస్తుంటే.. కాలుష్య రక్కసి కోరల్లో తిరుమల చిక్కుకుందన్న ఆం దోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా.. టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి అధ్యక్షతన రెండ్రోజుల కిందట తిరుమలలో ఆర్టీఏ, ఆర్టీసీ, కాలుష్య నియంత్రణ మండలి, పోలీస్‌ అధికారుల సమావేశం జరిగింది.
 
కాలుష్య నియంత్రణ మండలి తిరుమల ఘాట్లలో సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ టాక్సిక్‌ మెటల్స్‌ (సీఏటీఎం) మానిటర్స్‌ ఏర్పాటు చేసింది. వాహనాల ద్వారా వచ్చే à°•à°¾ లుష్యాన్ని ఇది నమోదు చేస్తుంది. అలా నమోదైన డేటాను కాలుష్య నియంత్రణ మండలికి చేర్చుతుంది. ఈనేపథ్యంలో à°ˆ ఏడాది తిరుమలలో ప్రమాదకరమైన స్థాయిలో కాలుష్యం పెరిగిపోతోందని కాలుష్య నియంత్ర à°£ మండలి గుర్తించింది. కాలుష్య నియంత్రణ కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని టీటీడీకి నోటీసు ద్వారా సూచించింది. ఈక్రమంలో సంబంధిత అధికారులతో టీటీడీ సమావేశమైంది.
 
 
తిరుపతి-తిరుమల మధ్య ఆర్టీసీ రోజుకు దాదాపు 1500 ట్రిప్పులతో బస్సులు నడుపుతోంది. అంతేగాక ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికులు, ప్రజ లు వాహనాలు వినియోగించడంతో కాలుష్యం పెరిగి, పర్యావరణంపై ప్రభావం చూపుతోంది. వాహ నాల నుంచి వచ్చే విషపూరిత నైట్రోజన్‌ ఆక్సైడ్‌ (ఎన్‌వో) వాతావరణంలో ఓజోన్‌తో కలిసి ఫోటోకెమికల్‌ స్మాగ్‌ (పొగ)à°—à°¾ ఏర్పడుతుంది. ఇది మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విపరీతంగా వాహనాలు వినియోగించడం వల్ల నగర వాతావరణంలో ఎనిమిది రకాల ప్రమాదకర కారకాలు వాయుకాలుష్యాన్ని పెంచేస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మెట్రో పాలిటన్‌ సిటీ హైదరాబాద్‌ కన్నా తిరుమలలో గాలి కాలుష్యం అధికంగా ఆవరించి ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే గాలిలోని నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ (ఎన్‌వోటూ).. న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకన్నా తిరుమలలోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర కాలుష్య ని యంత్రణ మండలి (సీపీసీబీ) నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.