ముఖ్యమంత్రి జగన్‌కు మరింత భద్రత

Published: Thursday July 04, 2019
ముఖ్యమంత్రి జగన్‌కు పోలీసులు మరింత భద్రత పెంచారు. ఇప్పటికే సాయుధ పోలీసు బలగాలతోపాటు స్థానిక పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు తాజాగా డ్రోన్లను రంగంలోకి దించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసం చుట్టూ 200 మీటర్ల ఎత్తున పోలీసు డ్రోన్లు ఎగురుతున్నాయి. పరిసర ప్రాంతాలతోపాటు సీఎం నివాసానికి వచ్చే దారుల్లోనూ డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. à°† దృశ్యాలను మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ప్రాంగణంలో ఉన్న టెక్‌ టవర్‌ నుంచి ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా చిన్న అనుమానాస్పద కదలిక కనిపించినా వెంటనే సీఎం క్యాంపు కార్యాలయంలోని భద్రతాధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో ట్రాఫిక్‌ ఎలా ఉంది..? ఎవరైనా ఆందోళనకారులు అటువైపు వస్తున్నారా..? కాన్వాయ్‌ నిరాటంకంగా వెళ్లే అవకాశం ఉందా? సీఎం నివాస పరిసరాల్లో సిబ్బంది అప్రమత్తంగా డ్యూటీ చేస్తున్నారా.. అంశాలన్నీ టెక్‌టవర్‌ నుంచి పరిశీలించి అప్రమత్తం చేస్తారు.
 
 
రోడ్డుపై ఉండే పోలీసులకు కొంత దూరం మాత్రమే కనిపించే అవకాశం ఉన్నందున పోలీసుశాఖ డ్రోన్లను తీసుకొచ్చింది. గతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు మావోయిస్టుల కూంబింగ్‌కు వెళ్లే సమయంలో అడవుల్లో వారిని పసిగట్టేందుకు డ్రోన్లు వినియోగించేవి. అయితే ముఖ్యమంత్రి నివాసం తాడేపల్లిలో స్థానిక ప్రజల ఇళ్ల మధ్యలో ఉంది. సీఎం నివాసం ముందున్న వారిని ఇప్పటికే పరిహారం చెల్లించి అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. వెనుకవైపు అపార్ట్‌మెంట్లను ఖాళీ చేయించడం సాధ్యం కాదని డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. దీనికితోడు ఇటీవల జగన్‌ నివాసానికి వెళ్లే దారిలో నిరుద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఇతరులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకట్రెండు సార్లు సీఎం కాన్వాయ్‌à°•à°¿ అడ్డంగా దూసుకొచ్చారు కూడా. à°ˆ నేపథ్యంలో పోలీసుశాఖ డ్రోన్లను రంగంలోకి దించింది.