ఇళ్ల లెక్కలపై బాబు, నారాయణ, లోకేశ్‌ చర్చకు రావాలి

Published: Saturday July 06, 2019
రాష్ట్రంలోని పేదలు నయాపైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే పక్కాగృహాలను నిర్మించి, అందజేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలోని 20- 25లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. పల్లెల్లో ఇండిపెండెంట్‌ ఇళ్లు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు ఇస్తామని చెప్పారు. రాజీవ్‌ స్వగృహ పథకం à°•à°¿à°‚à°¦ ఇళ్లకోసం ప్రభుత్వానికి కొంతమొత్తం చెల్లించినవారికి నష్టం కలగకుండా ఏం చేయాలనే అంశంపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. శుక్రవారం మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, నిరుపేదలకు గృహవసతి పేరిట à°—à°¤ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.వందల కోట్లమేర అవినీతి జరిగిందని ఆరోపించారు. షియర్‌వాల్‌ టెక్నాలజీని తామే మొట్టమొదటిసారిగా వాడుతున్నట్లుగా చెబుతూ à°† నెపంతో ఇళ్ల అంచనా వ్యయాన్ని ఎక్కడా లేనంతగా పెంచిన మాజీమంత్రి పి.నారాయణ దోపిడీకి తెర తీశారన్నారు. దేశంలో నిరుపేదల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.1,000-1,200వరకు మాత్రమే ఉందన్నారు. అయితే ఇక్కడ మాత్రం దాన్ని రూ.2,200కు పెంచడం ద్వారా నిరుపేదలను నిలువుగా దోచుకున్నారని ఆరోపించారు. à°—à°¤ ప్రభుత్వం అయిదేళ్లలో చేపట్టింది 7లక్షల ఇళ్లనేనని, వాటిలోనూ తుదిదశకు చేరుకున్నవి 92వేలకు లోపేనన్నారు. అందులో ఒక్కటి కూడా పేదలకు అందించలేదని చెప్పారు. నిజం ఇలా ఉంటే... 25లక్షల గృహాలు కట్టించినట్లు అసత్యాలు ప్రచారం చేశారన్నారు.
 
à°ˆ లెక్కలన్నింటినీ చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌కు పంపుతామని, వారు వాటిని పరిశీలించి, తమతో చర్చకు రావొచ్చని బొత్స అన్నారు. పేదలకు ఎంతో అన్యాయం చేసిన చంద్రబాబు, నారాయణను దేవుడెలా క్షమిస్తాడని మంత్రి ప్రశ్నించారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని పెద్ద కుంభకోణంగా మలచిన చంద్రబాబు, నారాయణ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని, తప్పును అంగీకరిస్తే చరిత్ర క్షమిస్తుందని బొత్స వ్యాఖ్యానించారు. కక్షసాధింపు ధోరణితోనే ప్రస్తుత ప్రభుత్వం తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందంటున్న టీడీపీ నేతల ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదన్నారు. పేదలకు న్యాయం చేయడంతోపాటు భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి అక్రమాలకు పాల్పడాలంటే భయపడేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వ పెద్దలు స్వాహా చేసిన మొత్తాలను ఎలా కక్కించాలో తమకు తెలుసునని, తాము చేస్తున్న ఆరోపణలన్నింటినీ రుజువు చేసే అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గృహ నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులైన అందరిపై ఇతర చర్యలూ కచ్చితంగా తీసుకుంటామన్నారు. అవినీతిమయమైన పాత టెండర్లను రద్దు చేసి, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మళ్లీ పిలుస్తామని, ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. మాజీమంత్రి లోకేశ్‌ను ‘అమెరికన్‌ బాయ్‌’à°—à°¾ అభివర్ణించిన బొత్స... ఆయన ప్రజల్లోకి వచ్చి వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.