నిరక్షరాస్యత, డ్రాపవుట్లు లేని రాష్ట్రమే ప్రభుత్వం కల

Published: Saturday July 06, 2019

‘విద్య అనేది వ్యాపారం కాదు, సేవ మాత్రమే. గ్రామాల్లో ఉన్నవారు లక్షలకు లక్షలు ఫీజులు కట్టడం కష్టం. వారి కోసం నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం’ అని సీఎం జగన్‌ వెల్లడించారు. స్కూలు, కాలేజీ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం à°’à°• రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకువస్తామని, చట్టం కూడా చేస్తామని తెలిపారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌కోసం ఇంటర్మీడియెట్‌ దాటిన ప్రతి విద్యార్థికీ ఏటా రూ.20వేలు ఇస్తామన్న ఆయన, à°ˆ డబ్బు కూడా తల్లికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యారంగ సంస్కరణలపై ఏర్పాటైన నిపుణులకమిటీ తనతో శుక్రవారం సమావేశమైన సందర్భంగా ప్రభుత్వ ఆలోచనలను సీఎం జగన్‌ వెల్లడించారు. ‘రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదు. ఏ దశలోను పిల్లల చదువు ఆగకూడదు. స్కూ లు నుంచి ఉన్నతవిద్య పూర్తయ్యే వరకు డ్రాపవుట్‌ లేకుండా చేయాలి. డిగ్రీ తీసుకున్నాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయడాన్ని à°’à°• సవాల్‌à°—à°¾ తీసుకున్నామని చెప్పారు. ‘à°—à°¤ ప్రభుత్వం పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లనీయకుండా నిరుత్సాహపరిచింది. 6-8 నెలలైనా మధ్యాహ్న భోజన కార్మికులకు సరుకులకు బిల్లులు చెల్లించలేదు. పుస్తకాలు సకాలానికి ఇవ్వలేదు. ఏప్రిల్‌, మే, జూన్‌ మొదటివారంలో అందాల్సిన డబ్బు లు అక్టోబరు వచ్చినా అందించలేదు. ‘మాకు పుస్తకాలు అందలేదం’టూ పాదయాత్రలో అక్టోబరు నెలలో పిల్లలు నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి’ అని చెప్పారు