మద్యనిషేధం చేసేదిశగా ప్రభుత్వం మరో ఆలోచన

Published: Tuesday July 09, 2019
 à°®à°¦à±à°¯à°‚ వినియోగాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా అమ్మకాల సమయాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 10à°—à°‚à°Ÿà°² వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అక్టోబరు నుంచి అమలు చేయనున్న నూతన పాలసీలో అమ్మకాలను సాయంత్రం 6à°—à°‚à°Ÿà°² వరకే పరిమితం చేయాలని ఆలోచన చేస్తోంది. సాయంత్రం అమ్మకాలను నాలుగు గంటలు తగ్గిస్తే అమ్మకాలు పెద్దఎత్తున తగ్గిపోతాయని ప్రభుత్వం భావన. సాధారణంగా మద్యం అమ్మకాలు సాయంత్రం నుంచి రాత్రి వరకే ఎక్కువగా ఉంటాయి. మందుప్రియులు అధికంగా రాత్రే మద్యం తాగుతారు. ఉదయం పనులకు వెళ్లి వచ్చిన కూలీల్లోనూ ఎక్కువ మందికి రాత్రి మందు తాగే అలవాటు ఉంటుంది. అందువల్లే రాత్రి అయితే మద్యం షాపులు కిక్కిరిసి పోతుంటాయి. à°† సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచనా.
 
అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నూతన పాలసీ అక్టోబరు నుంచి అమల్లోకి రానున్నందున ప్రభుత్వం పలు రకాల కొత్త ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. అందులో సమయం కుదింపు అంశం ఒకటి. కొత్త పాలసీలో ప్రభుత్వమే షాపులు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించుకోనుంది. సమయాన్ని తగ్గిస్తే సిబ్బంది పనివిధానం కూడా సులభతరం అవుతుందనేది మరో ఆలోచన. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అంటే రెండు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. కానీ అది ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది. అందువల్ల సాయంత్రం 6గంటల వరకు అమ్మకాలను కుదిస్తే ఒకే షిఫ్టుతో సిబ్బందితో పనిచేయించుకోవచ్చు.