3వారాలపాటు సీఆర్డీయే నోటీసు అమలు నిలిపివేత

Published: Friday July 12, 2019
కృష్ణానదికి-కరకట్టకు మధ్య నిర్మించిన à°“ భవనాన్ని కూల్చివేయాలంటూ సీఆర్డీయే ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. 3 వారాలపాటు à°† నోటీసు అమలును నిలిపివేసింది. à°ˆ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామపరిధిలో నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని, షెడ్లను 7 రోజుల్లోగా తీసేయాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామంటూ సీఆర్డీయే అధికారులు జూన్‌ 27à°¨ పారిశ్రామికవేత్త చందన కేదారీశ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. à°ˆ సందర్భంగా పిటిషనర్‌ న్యాయవాది రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ‘కేదారీశ్‌ 2006-07లోనే ‘రైతు సంఘం భవన్‌’ పేరుతో ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికి సీఆర్డీయే ఆవిర్భవించలేదు. 2014 ఏపీ సీఆర్డీయే చట్టం రూపుదిద్దుకోక ముందే à°† భవనాన్ని కట్టినందున, దానిని తొలగించాలని ఆదేశించే అధికారం సీఆర్డీయే కేపిటల్‌ సిటీ జోన్‌ కమిషనర్‌కు లేదు. అందువల్ల వారిచ్చిన నోటీసు అమలును అడ్డుకోవాలి’ అని కోర్టును అభ్యర్థించారు.
 
 
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘నదీ తీరంలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ గతంలోనే ఆదేశాలిచ్చింది. కృష్ణానదీ తీరం వెంబడి అంతకుముందు అమలులో ఉన్న చట్టాలు కూడా సీఆర్డీయే పరిధిలోకి వస్తాయి. à°ˆ విషయంలో పిటిషనర్‌ అవగాహనా లేమితో కోర్టును ఆశ్రయించారు. సీఆర్డీయే నోటీసుపై అభ్యంతరాలుంటే ‘అప్పిలేట్‌ అథారిటీ’ని ఆశ్రయించాలేగానీ హైకోర్టుకు రాకూడదు. à°† భవనం ఏపీసీఆర్డీయే చట్ట నిబంధనలకు విరుద్ధంగా రూపొందినదే’ అని పేర్కొన్నారు. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత.. సీఆర్డీయే జారీ చేసిన నోటీసు అమలును 3వారాలపాటు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.