ఎమ్మెల్యే... లేదంటే మంత్రి లేఖ ఇస్తేనే కోరిన చోటుకి బదిలీ

Published: Friday July 12, 2019
బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషించారు. గతంలో ఉన్న 20 శాతం పరిమితిని ఎత్తివేసి, ఉద్యోగులందరికీ కొత్త ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాన్నాళ్లుగా బదిలీలు లేనికారణంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు.. ఈసారైనా కోరుకొన్న చోటుకు వెళ్లొచ్చునని ఆశపడ్డారు. à°ˆ ఆశతో ఉన్నవారికి తొలి అడుగులోనే ఆశాభంగం ఎదురవుతోంది. ‘మీ ఎమ్మెల్యే లేఖ తెచ్చావా?’.. అన్న ప్రశ్న ఇప్పుడు పలు శాఖల్లో వినిపిస్తోంది. సర్వీసును తప్ప సిఫారసులను నమ్ముకోని చాలామంది ఉద్యోగులు à°ˆ ప్రశ్నకు కుంగిపోతున్నారు. జీరో సర్వీసు బదిలీలు అనడంతో ప్రాధాన్యక్రమంలో వెనుకబడుతున్నామని సీనియర్లు సైతం వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత, ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఈనెల 5 వరకు ఎత్తివేసింది. à°† గడువును తర్వాత à°ˆ నెల 10 దాకా పెంచారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు 12à°µ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. గతంలో 20 శాతం బదిలీలకు అవకాశమివ్వగా ఇప్పుడు నూరు శాతం బదిలీకి అవకాశం కల్పించారు. అయితే, ఎమ్మె ల్యే లేఖ ఉంటేనే పని అవుతుందని ఆయా శాఖల ఉన్నతాధికారులు తేల్చేస్తున్నారు. ఎమ్మెల్యే లేక à°† జిల్లా మంత్రి అనుమతి ఉండాల్సిందేనని చెబుతున్నారు.
 
 
కాగా.. à°ˆ పద్ధతుల్లో గతంలో ఎన్నడూ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. పైగా జీరో సర్వీసు ఆధారంగా బదిలీలు జరగడంతో సీనియర్లకు పలుచోట్ల అన్యాయం జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో ప్రాంతానికి ఎమ్మెల్యే ఇద్దరికి, ముగ్గురికి లేఖలు ఇవ్వడంతో హెచ్‌వోడీలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి చివరకు ఖరారు చేసుకుంటున్నారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో à°ˆ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. మండలాల్లో ఎమ్మెల్యేల నుంచి లేఖలు తెస్తేనే తమకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారని కొందరు ఇంజనీర్లు వాపోతున్నారు. సాక్షాత్తు పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌à°«à°—à°¾ జూనియర్‌ను నియమించడం గమనార్హం. ఆయనకంటే సీనియర్లుగా ఉన్న ఇంజనీర్లు వెనుకబడినవర్గాల కేటగిరీకి చెందినా, వారికి అవకాశమివ్వలేదు. ఎంపీడీవోల బదిలీలు కూడా ఇదే పద్ధతిలో కొనసాగాయి. ఎన్నికల విధులకు వెళ్లిన ఎంపీడీవోలకు, అంతకు పూర్వం à°† స్థానంలో ఉన్న ఎంపీడీవోలకు ఇద్దరికీ ఎమ్మెల్యేలు లేఖలు ఇవ్వడంతో జిల్లా పరిషత్‌ సీఈవోలు అయోమయానికి గురయ్యారు. కొన్నిచోట్ల దళారీలు సైతం రంగప్రవేశం చేశారని తెలిసింది.