వలంటీర్ల నియామకాల్లో సిఫార్సులకే పెద్దపీట

Published: Monday July 15, 2019
గ్రామ వలంటీర్ల నియామకంలో సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీంతో ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నవారు కూడా అసలు విషయం తెలియడంతో ఇంటర్వ్యూలకు సైతం హాజరుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అభ్యర్థుల గైర్హాజరు శాతం అమాంతంగా పెరిగిపోతోంది. ఎంపికైన వారిలో కూడా ఆసక్తి కరువేననే చర్చ జరుగుతోంది. ఎంపికైన వారిలో శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టే సరికి మరింత మంది వెనుదిరిగే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో 14,007 మంది గ్రామ వలంటీర్లను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే జిల్లాలోని 1029 గ్రామ పంచాయతీల్లోనూ ప్రతి 50 కుటుంబాలకు à°’à°• వలంటీర్‌ చొప్పున 7,83,130 కుటుంబాలకుగానూ 15,247 మంది వలంటీర్లు అవసరమని అధికారులు తేల్చారు. అందుకనుగుణంగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి à°ˆ నెల 11 నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రి à°¯ చేపట్టారు.
 
63 మండలాలను 89 ప్యానల్స్‌à°—à°¾ కేటాయించి 55,1 88మంది అభ్యర్థులను ఈనెల 23 వరకూ ఇంటర్వ్యూ చేసేలా దశల వారీగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా ఈనెల 11à°¨ 89 ప్యానల్స్‌కు సంబంధించి 2,670 మందికి గాను.. 2013 మంది మాత్రమే హాజరయ్యారు. 654 మంది గైర్హాజరయ్యారు. 12à°¨ 5,274 మందికి గాను కేవలం 4,008 మంది మాత్రమే హాజరయ్యారు. 1266 మంది గైర్హాజరయ్యారు. 13à°¨ 5,581 అభ్యర్థులకు గాను.. 4,020 మంది మాత్రమే హాజరయ్యారు. 1561 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. గైర్హాజరు శాతం ఎక్కువగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాయకుల సిఫార్సులకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జాబితా సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంటర్వ్యూలకు హాజరుకావడం దండగ.. రానిదానికోసం ఎందుకు హాజరుకావాలనే అభిప్రాయంతో కొందరు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది. అలాగే జిల్లా కేంద్రం, మండల కేంద్రాలకు సమీపంలో à°—à°² పంచాయతీల్లో అభ్యర్థుల నుంచి కొంత స్పందన ఉన్నప్పటికీ.. సుదూర ప్రాంతపు పంచాయతీల్లో అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దరఖాస్తులే తక్కువగా వచ్చాయని, ఇక à°† ప్రాంతాల్లో హాజరుశాతం ఎలా ఉంటుందోనని అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. వాటిని భర్తీచేయడం ఎలా అనే విషయమై చర్చ జరుగుతోంది. ఏమి జరుగుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.