నేడు సభలో పోలవరం ప్రాజెక్టుపై స్పష్టత

Published: Monday July 15, 2019
పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా? à°ˆ ప్రాజెక్టుకు రివర్స్‌ టెండర్లు పిలుస్తారా? పాత టెండర్లను రద్దు చేసి మొత్తం ప్రాజెక్టు హెడ్‌వర్క్సుకు కొత్తగా టెండర్లను పిలిచి కొత్త కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగిస్తారా?... à°ˆ ప్రశ్నలకు సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలవరం అంచనాలు రూ.16,010.45 కోట్లనుంచి రూ.55,54 8.87 కోట్లకు పెరిగిన వైనం ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చే వీలుంది. దీనిపై ప్రభుత్వం చెప్పే సమాధానం ఆసక్తికరంగా మారింది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు తుది అంచనాలు రూ.55,548.87 కోట్లకు పెంచుతూ, కేంద్రం ఆమోదముద్ర వేసింది. à°ˆ ప్రాజెక్టు అంచనాలకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘టీఏసీ’ ఆమోదముద్ర వేసిందని పార్లమెంటులో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. à°ˆ సమాధానంపై వైసీపీ ఎంపీ విజయసాయి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభ్యర్థించాకే, పోలవరం అంచనాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని అప్పట్లో వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రంలో భారీ, మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టుల టెండర్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పూర్తిస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు. à°—à°¤ ప్రభుత్వం అయినవారికి అయాచితంగా టెండర్లను కట్టబెట్టిందని ఎన్నికల కు ముందు ఆరోపించారు. à°ˆ మేరకు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే.. à°—à°¤ సర్కారు ఖరారు చేసిన టెండర్లపై అధ్యయనం చేసేందుకు రిటైర్ట్‌ ఇంజనీర్లతో కూడిన బృందాన్ని నియమించారు. à°ˆ బృందం ఇప్పటికే జల à°µ నరులు, రహదారులు, మౌలిక సదుపాయాల పనుల టెండర్లపై అధ్యయనం ప్రారంభించింది. à°ˆ కమిటీ ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై తన ప్రాథమిక నివేదికను అందజేసింది. పోలవరం ప్రాజెక్టును లక్ష్యం మేరకు పూర్తి చేయాల్సి ఉన్నందున, త్వరిత గతిన పనులు చేపట్టేందుకు వీలుగా టెండర్లపై à°’à°• నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
 
శాసనసభా ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం అంచనాల పెరుగుదలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 2010-11 నాటికి పోలవరం ప్రాజెక్టు అంచనాల్లో హెడ్‌వర్క్స్‌ వ్యయం రూ.6600.56 కోట్లుగా ఉంది. అది ఇప్పుడు 9734. 34 కోట్లకు చేరుకుంది. భూ సేకరణ వ్యయం రూ.2934. 42 కోట్ల నుంచి తాజాగా 33168.23 కోట్ల రూపాయలకు చేరుకుంది. తాజా అంచనాలను పరిశీలించాక.. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని సాంకేతిక సలహా మండలి(టీఏసీ)à°•à°¿ పోలవరం ప్రాజెక్టు అథారిటీ తుది అంచనా వ్యయం రూ.55548.87 కోట్లుగా పంపింది. అయితే, కేంద్రం ఆమోదించిన అంచనాలను జగన్‌ సర్కారు కుదిస్తుందా? రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సోమవారం సభలో సర్కారు స్పష్టతను ఇవ్వనుందని సమాచారం.