చిన్న తప్పిదం, చేజారుతున్న అవకాశం

Published: Thursday July 18, 2019
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°µà°¾à°ªà±à°¤à°‚à°—à°¾ నిర్వహిస్తున్న వలంటీర్ల ఇంటర్వూల్లో ఆప్షన్‌ ఎంపికలో చేసిన చిన్న పొరపాటు కారణంగా అనేకమంది అర్హులు నష్టపోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా చేరిన పంచాయతీలు, మండలాల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రూరల్‌ ప్రాంతంలో వున్న à°ˆ అభ్యర్థులు విలీనం తర్వాత పట్టణ ప్రాంత పరిధిలోకి వస్తున్నారు. కానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడు రూరల్‌à°—à°¾ పేర్కొనడంతో ఇంటర్వ్యూలకు హాజరుకాలేకపోతున్నారు.
 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారందరికీ ఇంటర్వ్యూకు హాజరుకావాలని మెసేజ్‌లు అయితే వస్తున్నాయి కానీ... తీరా అక్కడకు వెళ్లే సరికి ‘మీ స్థానికత ఇక్కడ కాదు కనుక రూరల్‌ ప్రాంతంలో వున్న తహసీల్దార్‌ లేదా ఎంపీడీవోను కలవండి’ అని చెప్పి పంపేస్తున్నారు. ఉదాహరణకు వేపగుంట సమీపంలోని నాయుడుతోట వెంకటసాయినగర్‌కు చెందిన à°’à°• యువతి ఆన్‌లైన్‌లో వలంటీర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకొంది. à°† సమయంలో ఆపరేటర్‌ పొరపాటున రూరల్‌ ఆప్షన్‌ పెట్టడంతో ఆమెకు పెందుర్తి మండలంలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని మెసేజ్‌ వచ్చింది. వాస్తవానికి ఆమె వుంటున్న ప్రాంతం జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది. తీరా అక్కడకు వెళితే జోనల్‌ కార్యాలయానికి వెళ్లాలంటూ పంపేశారు.
 
మరి కొంతమంది పట్టుబట్టి ఇంటర్వ్యూ చేయాలని అడిగితే స్థానికతకు ఇచ్చే మార్కులు కోల్పోతారని చెప్పి పంపేస్తున్నారు. పోనీ జోనల్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నారా? అంటే అక్కడ జాబితాలో పేరు లేనిదే ఇంటర్వ్యూ నిర్వహించలేమని స్పష్టం చేస్తున్నారు. ఇలా నిత్యం అనేకమంది వెనుతిరుగుతున్నారు. ఇటువంటివన్నీ సరిదిద్దే అవకాశం సాఫ్ట్‌వేర్‌లో లేదని ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. à°ˆ సమస్యను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళతామని అధికారులు చెబుతున్నారు.