22న చంద్రయాన్‌-2 ప్రయోగం

Published: Thursday July 18, 2019
చంద్రయాన్‌-2 ప్రయోగ సమయంలో తలెత్తిన లోపాన్ని 48 గంటల్లోనే ఇస్రో శాస్త్రవేత్తలు సరిదిద్దారు. ప్రయోగ వేదికపైనే కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో à°ˆ నెల 22à°µ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు తిరిగి ప్రయోగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనిపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రకటన చేయాల్సి ఉంది. à°ˆ నెల 15à°µ తేదీ తెల్లవారుజామున జీఎస్‌ఎల్వీ మార్క్‌3à°Žà°‚1 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగానికి సన్నద్ధమైన సమయంలో 56.24 నిమిషాల ముందు క్రయోఇంజన్‌లో లోపాన్ని గుర్తించి లాంచింగ్‌ ఆపేశారు. అదేరోజు ఉదయం షార్‌లోని రెండవ ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌లోని ఎల్‌-110, సీ-25 దశలలోని ఇంజన్లలో ద్రవ ఇంధనాన్ని తోడేశారు.
 
 
అనంతరం క్రయోఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడిన హీలియం గ్యాస్‌ చాంబర్‌ను పరిశీలించారు. క్రయోఇంజన్‌లో మైనస్‌ 183 డిగ్రీల సెల్సియ్‌సలో ఉండే ద్రవ ఆక్సిజన్‌ను, మైనస్‌ 253 డిగ్రీల సెల్సియ్‌సలో ఉండే ద్రవ హైడ్రోజన్లు ఆవిరి కాకుండా నియంత్రించే హీలియం గ్యాస్‌ చాంబర్‌లో ప్రెజర్‌ (ఒత్తిడి) తగ్గిపోవడాన్ని గుర్తించి లోపాన్ని సరిదిద్దారు. మంగళవారం రాత్రి నుంచి హీలియం గ్యాస్‌ చాంబర్‌లోని ప్రెజర్‌ను బుధవారం ఉదయం వరకు తనిఖీ చేశారు. ఒత్తిడి నిలకడగా ఉండటంతో ప్రయోగానికి రాకెట్‌ సిద్ధమైనట్లు నిర్ణయించారు.